టీటీడీ ఆస్తుల విక్రయం సరికాదు: బండి సంజయ్

దిశ, న్యూస్‌బ్యూరో: తెలంగాణ, ఏపీ సీఎంలపై కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌కుమార్ ఫైర్ అయ్యారు. ఇద్దరు సీఎంలు హిందూ వ్యతిరేక శక్తులుగా వ్యవహరిస్తున్నారని, వారిని తరిమికొట్టే సమయం దగ్గరపడిందని మండిపడ్డారు. పలు రాష్ట్రాల్లో శ్రీవారి ఆస్తుల విక్రయంపై టీటీడీ నిర్ణయం తీసుకోవడాన్ని ఖండిస్తున్నామని పేర్కొన్నారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఓ ప్రకటన రిలీజ్ చేశారు. తమిళనాడులోని 23ప్రాంతాల్లో శ్రీవారి ఆస్తుల విక్రయానికి సిద్ధం అయ్యారని, ధార్మికక్షేత్రాన్ని, ధనార్జన క్షేత్రంగా మార్చాలనుకోవడం సరైన ఆలోచన కాదని సంజయ్ […]

Update: 2020-05-24 09:04 GMT

దిశ, న్యూస్‌బ్యూరో: తెలంగాణ, ఏపీ సీఎంలపై కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌కుమార్ ఫైర్ అయ్యారు. ఇద్దరు సీఎంలు హిందూ వ్యతిరేక శక్తులుగా వ్యవహరిస్తున్నారని, వారిని తరిమికొట్టే సమయం దగ్గరపడిందని మండిపడ్డారు. పలు రాష్ట్రాల్లో శ్రీవారి ఆస్తుల విక్రయంపై టీటీడీ నిర్ణయం తీసుకోవడాన్ని ఖండిస్తున్నామని పేర్కొన్నారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఓ ప్రకటన రిలీజ్ చేశారు. తమిళనాడులోని 23ప్రాంతాల్లో శ్రీవారి ఆస్తుల విక్రయానికి సిద్ధం అయ్యారని, ధార్మికక్షేత్రాన్ని, ధనార్జన క్షేత్రంగా మార్చాలనుకోవడం సరైన ఆలోచన కాదని సంజయ్ విమర్శించారు. వైసీపీ పాలనలో దేవుడి ఆస్తులకు రక్షణ లేకుండా పోయిందన్నారు. దాతలు ఇచ్చిన భూములను అమ్మేందుకు సిద్ధమైన ప్రభుత్వం భక్తులు ఇచ్చిన కానుకలను వదిలిపెడితే ప్రభుత్వానికి, రాష్ట్రానికి క్షేమమన్నారు. ఆస్తుల అమ్మకంతో వచ్చిన ఆదాయాన్ని క్రైస్తవ పార్థన మందిరాల నిర్మాణాలకు, పాస్టర్ల జీతాలకు ఇవ్వాలనుకుంటున్నారా..? అని ప్రశ్నించారు. హిందూవుల మనోభావాలతో ఆడుకోవాలని చూస్తే సీఎం జగన్‌‌‌‌మోహన్‌రెడ్డి రాజకీయ భస్మం కాక తప్పదన్నారు. వక్ఫ్‌బోర్డు ఆస్తులు, చర్చిల భూముల గురించి పట్టించుకొని ప్రభుత్వాలు హిందూ దేవాలయాల ఆస్తులను కాజేయాలని చూస్తున్నాయని విమర్శించారు.

Tags:    

Similar News