ఆరేండ్ల నుంచి ఆయన క్వారంటైన్‌లోనే ఉంటున్నాడు: బండి సంజయ్
దిశ, నల్లగొండ: గత ఆరేండ్లుగా సీఎం కేసీఆర్ క్వారంటైన్‌లోనే ఉంటున్నాడని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. మంగళవారం నల్లగొండ జిల్లాలోని బత్తాయి రైతుల సమస్యలను తెలుసుకునేందుకు క్షేత్రస్థాయిలో పర్యటించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. జిల్లాలో బత్తాయి రైతుల పరిస్థితి దయనీయంగా మారిందని, బత్తాయి కొనే దిక్కులేక రైతులు అల్లాడిపోతున్నారన్నారు. సీఎం కేసీఆర్ రైతులను కించపరిచే విధంగా మాట్లాడడం సరికాదని, తాను చెప్పిన తోటలనే వేయాలని రైతులను బెదిరించే ధోరణితో సీఎం […]
దిశ, నల్లగొండ: గత ఆరేండ్లుగా సీఎం కేసీఆర్ క్వారంటైన్‌లోనే ఉంటున్నాడని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. మంగళవారం నల్లగొండ జిల్లాలోని బత్తాయి రైతుల సమస్యలను తెలుసుకునేందుకు క్షేత్రస్థాయిలో పర్యటించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. జిల్లాలో బత్తాయి రైతుల పరిస్థితి దయనీయంగా మారిందని, బత్తాయి కొనే దిక్కులేక రైతులు అల్లాడిపోతున్నారన్నారు. సీఎం కేసీఆర్ రైతులను కించపరిచే విధంగా మాట్లాడడం సరికాదని, తాను చెప్పిన తోటలనే వేయాలని రైతులను బెదిరించే ధోరణితో సీఎం మాట్లాడడం దారుణమన్నారు. ధాన్యం కొనుగోలు చేసిన మాదిరిగానే బత్తాయిని ప్రభుత్వమే కోనుగోలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అకాల వర్షాలతో నష్టపోయిన ఏ రైతును ప్రభుత్వం ఆదుకున్న పాపాన పోలేదని మండిపడ్డారు. ప్రభుత్వం స్పందిస్తే బీజేపీ కార్యకర్తలు రైతులకు సేవకులుగా పనిచేస్తారని, ప్రతి అంశంలో కేంద్రంపై అభాండాలు వేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని బండి సంజయ్ ఫైరయ్యారు. పోతిరెడ్డిపాడు విషయంలో ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా బుధవారం ఉమ్మడి నల్లగొండ, మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాలో బీజేపీ కార్యకర్తలు నల్లబ్యాడ్జీలతో నిరసన తెలుపుతారని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం కరోనా కట్టడిలో ఆదర్శంగా ఉందని గొప్పలు చెప్పుకునేందుకే టెస్టులు చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు. ప్రజలకు ఏం జరిగినా రాష్ట్ర ప్రభుత్వం, కేసీఆర్ భాద్యత వహించాలన్నారు.