ఓటమి భయంతోనే దాడులు.. మేం తిరగబడితే తట్టుకోలేరు : బండి

దిశ, మహబూబాబాద్ : మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురులో ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డి, ఎస్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు హుస్సేన్ నాయక్ పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ బండి సంజయ్ తెలిపారు. పోలీసుల సమక్షంలోనే మా వాళ్ళపై దాడి జరిగిందని ఆయన ఆరోపించారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరగాలని మేము కోరుకుంటున్నామని, ఈ విషయంలో పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలన్నారు. రాత్రంతా టీఆర్ఎస్ నేతలు డబ్బులు పంచినా మేధావులు వారి ప్రలోభాలకు లొంగలేదని […]

Update: 2021-03-14 03:46 GMT

దిశ, మహబూబాబాద్ : మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురులో ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డి, ఎస్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు హుస్సేన్ నాయక్ పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ బండి సంజయ్ తెలిపారు. పోలీసుల సమక్షంలోనే మా వాళ్ళపై దాడి జరిగిందని ఆయన ఆరోపించారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరగాలని మేము కోరుకుంటున్నామని, ఈ విషయంలో పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలన్నారు.

రాత్రంతా టీఆర్ఎస్ నేతలు డబ్బులు పంచినా మేధావులు వారి ప్రలోభాలకు లొంగలేదని తెలుసుకుని.. ఇవాళ కూడా ఓటుకు రూ.10 వేలు పంచుతుంటే బీజేపీ శ్రేణులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఓటమి భయంతోనే TRS గుండాలు మా వాళ్లపై దాడులకు పాల్పడ్డారు. మేము ప్రతిదాడులకు దిగితే ఎదుర్కొవడం టీఆర్ఎస్ వల్ల కాదని గుర్తుంచుకోవాలి. ఈ ఘటనపై ఎన్నికల సంఘం వెంటనే స్పందించి రెండు నియోజకవర్గాల్లో పరిస్థితిని అదుపులోకి తీసుకోవాలి. మా వాళ్ళు తిరగబడితే జరగబోయే పరిస్థితులకు అధికార పార్టీదే పూర్తి బాధ్యత అని బండి సంజయ్ స్పష్టంచేశారు.

Tags:    

Similar News