ప్రభుత్వ అసమర్థత వల్లే భారీగా కేసులు
దిశ, సికింద్రాబాద్: కరోనా టెస్టులు చేయటంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీజేపీ గ్రేటర్ ఉపాధ్యక్షుడు బండపల్లి సతీష్ విమర్శించారు. సోమవారం సికింద్రాబాద్‌లోని బీజేపీ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్‌లో మెడికల్ ఎమర్జెన్సీని తలపించేలా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయని, ప్రభుత్వ అసమర్థతతే ఇందుకు కారణమని దుయ్యబట్టారు. ఆసుపత్రుల్లో వెంటిలేటర్లు కొరత తీవ్రంగా ఉందన్నారు. గాంధీతో పాటు అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనిచేసే డాక్టర్లు, నర్సులు, ఇతర పారామెడికల్ సిబ్బంది కరోనా వైరస్ బారిన పడుతున్నా, వారికి […]
దిశ, సికింద్రాబాద్: కరోనా టెస్టులు చేయటంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీజేపీ గ్రేటర్ ఉపాధ్యక్షుడు బండపల్లి సతీష్ విమర్శించారు. సోమవారం సికింద్రాబాద్‌లోని బీజేపీ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్‌లో మెడికల్ ఎమర్జెన్సీని తలపించేలా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయని, ప్రభుత్వ అసమర్థతతే ఇందుకు కారణమని దుయ్యబట్టారు. ఆసుపత్రుల్లో వెంటిలేటర్లు కొరత తీవ్రంగా ఉందన్నారు. గాంధీతో పాటు అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనిచేసే డాక్టర్లు, నర్సులు, ఇతర పారామెడికల్ సిబ్బంది కరోనా వైరస్ బారిన పడుతున్నా, వారికి పీపీఈ కిట్లను కూడా ప్రభుత్వం సమకూర్చలేకపోతుందని విమర్శించారు. కోవిడ్-19 పరీక్షల విషయంలో ఐసీఎంఆర్ మార్గదర్శకాలను ప్రభుత్వం తుంగలో తొక్కుతోందని బండపల్లి విమర్శించారు. ఈ సమావేశంలో బీజేపీ సీనియర్ నాయకుడు రాచమల్ల కృష్ణమూర్తి, ప్రభు గుప్త, నాగేశ్వర్ రెడ్డి, వెంకటేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.