కరోనా ఎఫెక్ట్.. కూరగాయలు అమ్ముతున్న డైరెక్టర్

దిశ, వెబ్‌డెస్క్: ‘బాలికా వధు (చిన్నారి పెళ్లి కూతురు)’ సీరియల్‌కు కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. బాల్య వివాహాలు చేస్తే పిల్లలు ఎదిగాక ఏం జరుగుతుంది? ఆ తర్వాత వారి జీవితాల్లో ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి? దానికి పెద్దలు ప్రాయశ్చిత్తం చేసుకోగలరా? అనే కథాంశంతో తెరకెక్కిన సీరియల్ చాలా పాపులరైన విషయం తెలిసిందే. కానీ అంతటి పాపులర్ సీరియల్‌ను అందించిన డైరెక్టర్ మాత్రం కరోనా ఎఫెక్ట్‌తో కూరగాయల వ్యాపారిగా మారిపోయాడు. చేసేందుకు పనిలేక పొట్ట నింపుకునేందుకు తోపుడు […]

Update: 2020-09-28 05:51 GMT

దిశ, వెబ్‌డెస్క్: ‘బాలికా వధు (చిన్నారి పెళ్లి కూతురు)’ సీరియల్‌కు కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. బాల్య వివాహాలు చేస్తే పిల్లలు ఎదిగాక ఏం జరుగుతుంది? ఆ తర్వాత వారి జీవితాల్లో ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి? దానికి పెద్దలు ప్రాయశ్చిత్తం చేసుకోగలరా? అనే కథాంశంతో తెరకెక్కిన సీరియల్ చాలా పాపులరైన విషయం తెలిసిందే. కానీ అంతటి పాపులర్ సీరియల్‌ను అందించిన డైరెక్టర్ మాత్రం కరోనా ఎఫెక్ట్‌తో కూరగాయల వ్యాపారిగా మారిపోయాడు. చేసేందుకు పనిలేక పొట్ట నింపుకునేందుకు తోపుడు బండి మీద కూరగాయలు అమ్ముకుంటున్నాడు.

‘బాలికా వధు’ సీరియల్ డైరెక్టర్లలో ఒకరైన రామ్ వృక్ష గౌర్.. ప్రస్తుతం ఉత్తర ప్రదేశ్‌లోని అజంఘర్ జిల్లాలో కూరగాయలు అమ్ముతున్నారు. ఓ మూవీ షూటింగ్ డైరెక్షన్‌‌కు బ్రేక్ ఇస్తూ సొంత ఊరికి చేరుకున్న రామ్ వృక్ష.. ఆ టైమ్‌లో లాక్‌డౌన్ ప్రకటించడంతో అక్కడే ఉండిపోవలసి వచ్చిందట. చిత్ర నిర్మాతను కాంటాక్ట్ చేస్తే ప్రాజెక్ట్ చేసేందుకు ఏడాది సమయం పడుతుందని చెప్పడంతో తండ్రికి చెందిన కూరగాయల వ్యాపారం చేసేందుకు నిర్ణయించుకున్నట్లు చెప్పాడు. ఇందులో సిగ్గుపడాల్సిన, విచారం చెందాల్సిన అవసరం లేదన్నారు. కూరగాయలు అమ్మడం గౌరవంగానే భావిస్తున్నట్లు తెలిపారు.

2002లో ముంబై చేరుకున్న రామ్ వృక్ష.. మొదట లైట్ డిపార్ట్ మెంట్‌లో పనిచేసి, ఆ తర్వాత కొన్ని టీవీ షోస్‌కు ప్రొడక్షన్ డిపార్ట్‌‌మెంట్‌లోనూ పనిచేశారు. తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేసిన తను, ‘బాలికా వధు’ ఎపిసోడ్ డైరెక్టర్, యూనిట్ డైరెక్టర్‌గా ఎదిగారు. బాలీవుడ్‌లో పలు సినిమాలకు కూడా పని చేసిన రామ్.. ప్రస్తుతం భోజ్‌పురిలో ఓ సినిమా డైరెక్ట్ చేయనున్నారు.

Tags:    

Similar News