అక్కడ కొబ్బరికాయలే.. కాలేజీ ఫీజు
దిశ, వెబ్‌డెస్క్ : గువహటిలోని ఓ స్కూల్‌లో విద్యార్థులకు ఫీజు ఉండదు. అందుకు బదులుగా ప్లాస్టిక్ వేస్ట్‌ను స్కూల్ యాజమాన్యానికి ఇవ్వాల్సి ఉంటుంది. పిల్లల్లో పర్యావరణ ప్రాముఖ్యతపై అవగాహన కలిగించడంతో పాటు ఆయా పిల్లల ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని స్కూల్ యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే, కరోనా పరిస్థితుల మూలంగా ఇటీవల పశ్చిమ బెంగాళ్‌లోని ఓ కాలేజీ కూడా పీజీ, డిగ్రీ ఎంట్రన్స్‌కు కేవలం ఒక్క రూపాయిని ఫీజుగా స్వీకరించిన విషయం తెలిసిందే. ఇండోనేషియాలోని […]
దిశ, వెబ్‌డెస్క్ :
గువహటిలోని ఓ స్కూల్‌లో విద్యార్థులకు ఫీజు ఉండదు. అందుకు బదులుగా ప్లాస్టిక్ వేస్ట్‌ను స్కూల్ యాజమాన్యానికి ఇవ్వాల్సి ఉంటుంది. పిల్లల్లో పర్యావరణ ప్రాముఖ్యతపై అవగాహన కలిగించడంతో పాటు ఆయా పిల్లల ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని స్కూల్ యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే, కరోనా పరిస్థితుల మూలంగా ఇటీవల పశ్చిమ బెంగాళ్‌లోని ఓ కాలేజీ కూడా పీజీ, డిగ్రీ ఎంట్రన్స్‌కు కేవలం ఒక్క రూపాయిని ఫీజుగా స్వీకరించిన విషయం తెలిసిందే. ఇండోనేషియాలోని ఓ యూనివర్సిటీ సైతం కరోనా కారణంగానే.. కొబ్బరి బొండాలను ఫీజు రూపేణా ఇవ్వాల్సిందిగా విద్యార్థులకు సూచించింది.
కరోనా దెబ్బకు ఇండోనేషియా ఆర్థిక వ్యవస్థ దెబ్బతింది. ప్రజలు కూడా ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారు. ఈ నేపథ్యంలోనే.. టెగాలలాంగ్ సిటీలోని ద బాలి సన్, వీనస్ వన్ టూరిజం అకాడమీ యూనివర్సిటీ.. తమ విద్యార్థుల ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ఓ వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా.. విద్యార్థులు ఫీజు రూపేణా కొబ్బరి కాయలు, మోరింగా లీవ్స్ (మునక్కాడ ఆకులు), గోటు కోలా లీవ్స్ ఇవ్వాలని తమ స్టూడెంట్స్‌కు వెల్లడించింది. విద్యార్థుల నుంచి సేకరించిన వాటితో కోకోనట్ ఆయిల్, హెర్బల్ సోప్ ప్రొడక్ట్స్ తయారుచేసి క్యాంపస్‌లో విక్రయించడం ద్వారా ఫండ్స్ సేకరించాలని నిర్ణయించుకుంది.
‘ట్యూషన్ పేమెంట్స్ స్కీమ్‌లో భాగంగా.. మూడు ఇన్‌స్టాల్‌మెంట్స్‌లో తీసుకునేవాళ్లం. తొలి ఇన్‌స్టాల్‌మెంట్‌లో మొత్తం ఫీజులో 50 శాతం, రెండో దాంట్లో 20 శాతం, మూడోది 30 శాతంగా స్వీకరించేవాళ్లం. అయితే, కరోనా పాండమిక్ అందరినీ అప్పుల్లోకి నెట్టేసింది. ఈ పరిస్థితుల్లో విద్యార్థులు ఫీజులు చెల్లించే స్థితిలో లేరు. అందుకే ఫీజు రూపంలో కోకోనట్స్ తీసుకుంటున్నాం. నేచురల్ రీసోర్స్‌ను ఉపయోగించుకుని వాటితో ఎండ్ ప్రొడక్ట్స్ తయారు చేస్తే అందరికీ లాభదాయకంగా ఉంటుంది’ అని అకాడమీ డైరెక్టర్ వాయన్ పసెక్ ఆది పుత్ర తెలిపాడు.