ఆయన ఇకలేరు
దిశ, వెబ్ డెస్క్: భారత హాకీ దిగ్గజం బల్బీర్ సింగ్(95) తుదిశ్వాస విడిచారు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఉదయం కన్నుమూశారు. మే 8న ఆస్పత్రిలో చేరిన బల్బీర్ సింగ్ కు వైద్యులు వెంటిలేటర్ పై ఉంచి చికిత్స అందించారు. భారత హాకీకి బల్బీర్ సింగ్ చేసిన సేవలు మరువలేనివి. 1957లో ప్రపంచ కప్ సాధించిన భారత హాకీ జట్టుకు బల్బీర్ సింగ్ కోచ్ గా వ్యవహరించారు. అదేవిధంగా 1948, 1952, 1956 […]
దిశ, వెబ్ డెస్క్: భారత హాకీ దిగ్గజం బల్బీర్ సింగ్(95) తుదిశ్వాస విడిచారు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఉదయం కన్నుమూశారు. మే 8న ఆస్పత్రిలో చేరిన బల్బీర్ సింగ్ కు వైద్యులు వెంటిలేటర్ పై ఉంచి చికిత్స అందించారు.
భారత హాకీకి బల్బీర్ సింగ్ చేసిన సేవలు మరువలేనివి. 1957లో ప్రపంచ కప్ సాధించిన భారత హాకీ జట్టుకు బల్బీర్ సింగ్ కోచ్ గా వ్యవహరించారు. అదేవిధంగా 1948, 1952, 1956 ఒలంపిక్స్ లలో భారత హాకీ జట్టు మూడు బంగారు పతకాలు గెలుపొందడంలో బల్బీర్ సింగ్ పాత్ర కీలకం. ఒలంపిక్స్ లో పురుషుల హాకీ ఫైనల్ లో అత్యధిక గోల్స్ చేసిన ఆటగాడిగా ఆయనకు గుర్తింపు ఉంది. ఆయన పేరు మీద ఉన్న రికార్డును ఇప్పటివరకు ఎవరూ అధిగమించలేదు. ఆయన సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం పద్మశ్రీతో సత్కరించింది.