బసవతారకంలో డిజిటల్ రేడియోగ్రఫీ.. ప్రారంభించిన బాలయ్య

దిశ, తెలంగాణ బ్యూరో: బసవతారం కేన్సర్‌ ఆస్పత్రిలో డిజిటల్‌ రేడియోగ్రఫీని అందుబాటులోకి తెచ్చామని నటుడు, ఆస్పత్రి చైర్మన్‌, మేనేజింగ్‌ ట్రస్టీ నందమూరి బాలకృష్ణ అన్నారు. వేల మంది కేన్సర్‌ రోగులకు విశిష్ట సేవలు అందజేస్తున్నట్లు వెల్లడించారు. హైదరాబాద్‌లోని బసవతారకం ఇండో-అమెరికన్‌ కేన్సర్‌ ఆసుపత్రిలో డిజిటల్‌ రేడియోగ్రఫీ సదుపాయాన్ని శుక్రవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఆసుపత్రి రేడియాలజీ విభాగంలో ఇప్పటికే 3డీ డిజిటల్‌ మమ్మోగ్రామ్‌ ఉందని, కొత్తగా డిజిటల్‌ రేడియోగ్రఫీని కూడా అందుబాటులోకి తెచ్చామని వెల్లడించారు. ఈ డిజిటల్‌ […]

Update: 2021-09-17 08:47 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: బసవతారం కేన్సర్‌ ఆస్పత్రిలో డిజిటల్‌ రేడియోగ్రఫీని అందుబాటులోకి తెచ్చామని నటుడు, ఆస్పత్రి చైర్మన్‌, మేనేజింగ్‌ ట్రస్టీ నందమూరి బాలకృష్ణ అన్నారు. వేల మంది కేన్సర్‌ రోగులకు విశిష్ట సేవలు అందజేస్తున్నట్లు వెల్లడించారు. హైదరాబాద్‌లోని బసవతారకం ఇండో-అమెరికన్‌ కేన్సర్‌ ఆసుపత్రిలో డిజిటల్‌ రేడియోగ్రఫీ సదుపాయాన్ని శుక్రవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఆసుపత్రి రేడియాలజీ విభాగంలో ఇప్పటికే 3డీ డిజిటల్‌ మమ్మోగ్రామ్‌ ఉందని, కొత్తగా డిజిటల్‌ రేడియోగ్రఫీని కూడా అందుబాటులోకి తెచ్చామని వెల్లడించారు.

ఈ డిజిటల్‌ రేడియోగ్రఫీ ఎంతో వేగవంతమైనదని తెలిపారు. సాధారణంగా ఫిల్మ్‌ పైన తీసే ఎక్స్‌ రేని డిజిటల్‌ రూపంలో వెంటనే చూసే వీలుంటుందన్నారు. పైగా, ఈ డిజిటల్‌ రేడియోగ్రఫీ ద్వారా తీసే ఎక్స్‌ రే ఇమేజ్‌ మంచి నాణ్యతతో ఉంటుందని పేర్కొన్నారు. కేవలం 8 గంటల వ్యవధిలో 200కి పైగా నాణ్యమైన ఎక్స్‌ రే ఇమేజ్‌లు తీయవచ్చని వెల్లడించారు. ముఖ్యంగా కేన్సర్‌ రోగులు తక్కువ రేడియేషన్‌కు గురవుతారని వివరించారు. ఇది పర్యావరణహిత సాంకేతికత అని తెలిపారు. ఎలాంటి కొత్త టెక్నాలజీనైనా బసవతారకం ఆసుపత్రిలో ప్రవేశపెట్టేందుకు తామెప్పుడూ ముందుంటామని స్పష్టం చేశారు. ఇటువంటి అత్యాధునిక టెక్నాలజీ సామాన్యులకు కూడా అందుబాటులో ఉండాలన్నదే ఎన్టీఆర్ ఆశయం అని పేర్కొన్నారు.

Tags:    

Similar News