బాలాపూర్ లడ్డు వేలం వేయం..
దిశ, మహేశ్వరం: ప్రతి ఏడాదీ వైభవంగా నిర్వహించే బాలాపూర్ గణేష్ నవరాత్రులు ఈసారి సాదాసీదాగా జరపాలని గణేష్ ఉత్సవ సమితి ఓ ప్రకటనలో తెలిపింది. ఈ సంవత్సరం 6 అడుగుల గణేష్ విగ్రహం ప్రతిష్టించాలని నిర్ణయించారు. అయితే, లడ్డు వేలం నిర్వహిస్తే అనేక ప్రాంతాల ప్రజలు పాల్గొని అవకాశం ఉండటంతో ఈ ధపా వేలం వేయొద్దని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో గణేష్ ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం లేదని ప్రకటనలో పేర్కొన్నారు. స్వామివారి మొదటి […]
దిశ, మహేశ్వరం: ప్రతి ఏడాదీ వైభవంగా నిర్వహించే బాలాపూర్ గణేష్ నవరాత్రులు ఈసారి సాదాసీదాగా జరపాలని గణేష్ ఉత్సవ సమితి ఓ ప్రకటనలో తెలిపింది. ఈ సంవత్సరం 6 అడుగుల గణేష్ విగ్రహం ప్రతిష్టించాలని నిర్ణయించారు. అయితే, లడ్డు వేలం నిర్వహిస్తే అనేక ప్రాంతాల ప్రజలు పాల్గొని అవకాశం ఉండటంతో ఈ ధపా వేలం వేయొద్దని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో గణేష్ ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం లేదని ప్రకటనలో పేర్కొన్నారు. స్వామివారి మొదటి పూజ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలోనే జరుగుతుందని సభ్యులు వివరించారు. భక్తులకు పూజా, దర్శనం అనుమతులు కూడా నిషేధించామన్నారు. శోభాయాత్ర మాత్రం ప్రభుత్వ నిర్ణయానికి కట్టుబడి చేస్తామని బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి స్పష్టంచేసింది.