అంతర్‌రాష్ట్ర దొంగ అరెస్ట్
దిశ, క్రైమ్‌బ్యూరో: చోరీలకు పాల్పడుతున్న అంతర్‌రాష్ట్ర దొంగను పోలీసులు అరెస్ట్ చేశారు. జీవనోపాధి కోసం మహారాష్ట్ర రత్నగిరి జిల్లా నుంచి హైదరాబాద్‌కు వచ్చిన రాహిల్ నూరద్ భోంబల్ వృత్తి రీత్యా డ్రైవర్. కొన్నిరోజుల పాటు హోటళ్లలో పనిచేసిన రాహిల్.. విలసాలాలకు అలవాటు పడి దొంగతనాలు చేయడం మొదలు పెట్టాడు.ఇదే క్రమంలో బంగారం షాపులకు కస్టమర్‌గా వెళ్లి చైన్‌లను కొనుగోలు చేస్తున్నట్లు నటించి మెడలో వేసుకొని పరారయ్యేవాడు. ఇలా సనత్‌నగర్, మేడ్చల్ పోలీస్ స్టేషన్ల పరిధిలో చోరీలకు పాల్పడగా […]
దిశ, క్రైమ్‌బ్యూరో: చోరీలకు పాల్పడుతున్న అంతర్‌రాష్ట్ర దొంగను పోలీసులు అరెస్ట్ చేశారు. జీవనోపాధి కోసం మహారాష్ట్ర రత్నగిరి జిల్లా నుంచి హైదరాబాద్‌కు వచ్చిన రాహిల్ నూరద్ భోంబల్ వృత్తి రీత్యా డ్రైవర్. కొన్నిరోజుల పాటు హోటళ్లలో పనిచేసిన రాహిల్.. విలసాలాలకు అలవాటు పడి దొంగతనాలు చేయడం మొదలు పెట్టాడు.ఇదే క్రమంలో బంగారం షాపులకు కస్టమర్‌గా వెళ్లి చైన్‌లను కొనుగోలు చేస్తున్నట్లు నటించి మెడలో వేసుకొని పరారయ్యేవాడు. ఇలా సనత్‌నగర్, మేడ్చల్ పోలీస్ స్టేషన్ల పరిధిలో చోరీలకు పాల్పడగా కేసులు నమోదయ్యాయి. విచారణ చేపట్టిన బాలానగర్ ఎస్వోటీ పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. 10 తులాల గోల్డ్‌ను స్వాధీనం చేసుకున్నారు.