పైసా వసూల్ కాంబినేషన్ రిపీట్?
నందమూరి నటసింహం బాలకృష్ణ.. ప్రస్తుతం బోయపాటి శ్రీనివాస్ దర్శకత్వంలో పవర్ ఫుల్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో బాలయ్య డబుల్ రోల్ చేస్తుండగా.. నెక్స్ట్ మూవీ డైరెక్టర్ బి. గోపాల్‌తో ఉండబోతుందని టాక్. అయితే స్క్రిప్ట్ పూర్తిగా సిద్ధం కాకపోవడంతో.. బాలయ్య తనకు నచ్చిన, తనను మెచ్చిన దర్శకుడు పూరీ జగన్నాధ్ డైరెక్షన్‌లో తర్వాతి సినిమా చేస్తాడని సమాచారం. ‘పైసా వసూల్’ సినిమా టైమ్‌లో పూరీ బాలయ్యకు బెస్ట్ కాంప్లిమెంట్స్ ఇచ్చాడు. తనతో మరో సినిమా కూడా […]
నందమూరి నటసింహం బాలకృష్ణ.. ప్రస్తుతం బోయపాటి శ్రీనివాస్ దర్శకత్వంలో పవర్ ఫుల్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో బాలయ్య డబుల్ రోల్ చేస్తుండగా.. నెక్స్ట్ మూవీ డైరెక్టర్ బి. గోపాల్‌తో ఉండబోతుందని టాక్. అయితే స్క్రిప్ట్ పూర్తిగా సిద్ధం కాకపోవడంతో.. బాలయ్య తనకు నచ్చిన, తనను మెచ్చిన దర్శకుడు పూరీ జగన్నాధ్ డైరెక్షన్‌లో తర్వాతి సినిమా చేస్తాడని సమాచారం.
‘పైసా వసూల్’ సినిమా టైమ్‌లో పూరీ బాలయ్యకు బెస్ట్ కాంప్లిమెంట్స్ ఇచ్చాడు. తనతో మరో సినిమా కూడా చేస్తానని అప్పుడే ప్రకటించాడు. బాలయ్య కూడా తన కెరియర్‌లో ఇంత స్టైలిష్ సినిమా ఎవరూ చేయలేదని ఆ టైమ్‌లో ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే. కాగా ఇప్పుడు ఈ కాంబినేషన్ రిపీట్ అవుతుందని ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. లాక్‌డౌన్‌లో ఉన్న పూరీ.. ఫోన్‌లోనే బాలయ్యకు కథ వినిపించాడని, బాలయ్యకు కూడా స్క్రిప్ట్ నచ్చిందని సమాచారం. అంటే బోయపాటితో సినిమా కంప్లీట్ కాగానే.. పూరీతో సినిమా పట్టాలెక్కే చాన్సుంది.