ఏపీ, తెలంగాణలో బ్రిటీషు పాలన: టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు బక్కని నర్సింహ

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో బ్రిటీషు పాలన మాదిరి ప్రభుత్వాలను నడుపుతున్నారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు బక్కని నర్సింహ ఆరోపించారు. టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబును విమానాశ్రయంలోనే సాయంత్రం వరకు ఉంచారని, లోకేష్ ను అరెస్టు చేశారని ఆరోపించారు. బ్రిటీషు పాలన సంప్రదాయాలను తెలుగు రాష్ట్రాల్లో అనుసరిస్తున్నట్లు అనిపిస్తోందన్నారు. ఎన్టీఆర్ భవన్ లో శుక్రవారం హైదరాబాద్ విలీన దినోత్సవం నిర్వహించారు. జాతీయ జెండాతో పాటు పార్టీ జెండాను ఆవిష్కరించి మాట్లాడారు. పటేల్, పట్వారీ వ్యవస్థను […]

Update: 2021-09-17 08:26 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో బ్రిటీషు పాలన మాదిరి ప్రభుత్వాలను నడుపుతున్నారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు బక్కని నర్సింహ ఆరోపించారు. టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబును విమానాశ్రయంలోనే సాయంత్రం వరకు ఉంచారని, లోకేష్ ను అరెస్టు చేశారని ఆరోపించారు. బ్రిటీషు పాలన సంప్రదాయాలను తెలుగు రాష్ట్రాల్లో అనుసరిస్తున్నట్లు అనిపిస్తోందన్నారు. ఎన్టీఆర్ భవన్ లో శుక్రవారం హైదరాబాద్ విలీన దినోత్సవం నిర్వహించారు. జాతీయ జెండాతో పాటు పార్టీ జెండాను ఆవిష్కరించి మాట్లాడారు. పటేల్, పట్వారీ వ్యవస్థను రద్దు చేసి ఎన్టీఆర్ తెలంగాణకు నిజమైన స్వాతంత్ర్యం తెచ్చారన్నారు. చంద్రబాబు హయాంలో ప్రజలను విద్యావంతులను చేయాలని చదువల పండుగ చట్టాన్ని అమలు చేశారని, అలాగే బ్యాక్ టు స్కూల్ కార్యక్రమం చేపట్టారన్నారు. మహిళల సాధికారతకు మ్యాచింగ్ గ్రాంటును ఏర్పాటు చేసి డ్వాక్రా సంఘాలను అభివృద్ధి పథంలో నడిపించారన్నారు.

కార్యక్రమంలో టీడీపీ పొలిట్ బ్యురో సభ్యుడు రావుల చంద్రశేఖర్ రెడ్డి, జాతీయ ప్రధాన కార్యదర్శి కొత్తకోట దయాకర్ రెడ్డి, జాతీయ అధికార ప్రతినిధి ప్రొఫెసర్ జ్యోత్స్న, రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షుడు బండి పుల్లయ్య, ప్రధాన కార్యదర్శులు అజ్మీరా రాజు నాయక్ , షేక్.ఆరీఫ్, అధికార ప్రతినిధి కుమారి జాఠోతు ఇందిరా , ఎస్సీసెల్ రాష్ట్ర అధ్యక్షుడు పొలంపల్లి అశోక్ , రాష్ట్ర పార్టీ కార్యదర్శులు ముంజ వెంకట రాజంగౌడ్ , ఆర్తం జ్ఞాన సుధా, మన్నెసంజీవ్ రావు, గుడెపు రాఘవులు, రాష్ట్ర టీఎన్టీయూసీ ఉపాధ్యక్షుడు ఏ.బీ.ఆర్ మోహన్, ప్రధాన కార్యదర్శి రత్నకర్, టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.రామకాంత్ గౌడ్, చెవెళ్ల పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి వెంకట్ రెడ్డి, టీఏన్టీయూసీ కార్యదర్శి జగదీష్, జుబ్లీహిల్స్ , ఖైరాతబాద్ డివిజన్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Tags:    

Similar News