కేసీఆర్ నెం.1 మోసగాడు.. కీలక వ్యాఖ్యలు చేసిన టీడీపీ అధ్యక్షుడు

దిశ, చిలుకూరు: దళితులకు ఇచ్చిన హామీలను అమలు చేయని ముఖ్యమంత్రి కేసీఆర్ దేశంలో నెం.1 మోసగాడని తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బక్కని నర్సింహులు ధ్వజమెత్తారు. ఆయన శనివారం సూర్యాపేట జిల్లా చిలుకూరులో ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించారు. 18 ఏళ్ల క్రితం టీడీపీ ప్రభుత్వ హయాంలో జన్మభూమి కార్యక్రమంలో భాగంగా చిలుకూరులో అర్హులైన 119 మంది దళితులకు ఇళ్ల పట్టాలు ఇచ్చిందని తెలిపారు. తెరాస ప్రభుత్వం నేటికీ వాటిని ప్లాట్లుగా మార్చలేదని, ఆ స్థలాల్లో […]

Update: 2021-12-11 07:37 GMT

దిశ, చిలుకూరు: దళితులకు ఇచ్చిన హామీలను అమలు చేయని ముఖ్యమంత్రి కేసీఆర్ దేశంలో నెం.1 మోసగాడని తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బక్కని నర్సింహులు ధ్వజమెత్తారు. ఆయన శనివారం సూర్యాపేట జిల్లా చిలుకూరులో ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించారు. 18 ఏళ్ల క్రితం టీడీపీ ప్రభుత్వ హయాంలో జన్మభూమి కార్యక్రమంలో భాగంగా చిలుకూరులో అర్హులైన 119 మంది దళితులకు ఇళ్ల పట్టాలు ఇచ్చిందని తెలిపారు. తెరాస ప్రభుత్వం నేటికీ వాటిని ప్లాట్లుగా మార్చలేదని, ఆ స్థలాల్లో వారికి డబుల్ బెడ్ రూం ఇళ్లు నిర్మించలేదని విమర్శించారు. పలుమార్లు ఈ విషయం అధికారులకు తెలిపినా పెడచెవిన పెడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

అధికారులు స్పందించకపోతే టీడీపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామన్నారు. ఈ విషయమై గవర్నర్, సీఎస్, ఎస్సీ కమిషన్ కు ఫిర్యాదు చేస్తామన్నారు. ముందుగా నర్సింహులు.. జగజ్జీవన్ రాం కాలనీలో అంబేద్కర్, జగజ్జీవన్ రాం విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నల్గొండ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడు నెల్లూరి దుర్గాప్రసాద్, చిలుకూరు మండల పార్టీ అధ్యక్షుడు దొడ్డా గురవయ్య, నాయకులు కొల్లు సత్యనారాయణ, గుండు వీరబాబు, మస్తాన్, తిరునగరి జ్యోత్స్న, ఓరుగంటి ప్రభాకర్, కొల్లు నర్సయ్య, రాధిక, శ్రీమన్నారాయణ తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News