ఉద్యోగులకు బజాజ్ ఆటో భరోసా

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ దిగ్గజ వాహన తయారీ సంస్థ బజాజ్ ఆటో తమ ఉద్యోగుల కోసం ఐదేళ్ల హాస్పిటలైజేషన్ ఇన్సూరెన్స్‌తో పాటు కొవిడ్ కారణంగా మరణిస్తే సిబ్బంది కుటుంబానికి నగదు సాయం అందించనున్నట్టు ప్రకటించింది. అలాగే కరోనా సెకెండ్ వేవ్ నేపథ్యంలో మహమ్మారిని ఎదుర్కొనేందుకు ఔరంగాబాద్‌లోని కొవిడ్ కేర్ సెంటర్‌ను అప్‌గ్రేడ్ చేయనున్నట్టు వెల్లడించింది. గతేడాది కంపెనీ చేపట్టిన కార్యక్రమాలకు అదనంగా ఈ చర్యలు ఉంటాయని బజాజ్ ఆటో ఓ ప్రకటనలో తెలిపింది. ఉద్యోగుల మానసిక, శారీరక […]

Update: 2021-05-14 04:00 GMT

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ దిగ్గజ వాహన తయారీ సంస్థ బజాజ్ ఆటో తమ ఉద్యోగుల కోసం ఐదేళ్ల హాస్పిటలైజేషన్ ఇన్సూరెన్స్‌తో పాటు కొవిడ్ కారణంగా మరణిస్తే సిబ్బంది కుటుంబానికి నగదు సాయం అందించనున్నట్టు ప్రకటించింది. అలాగే కరోనా సెకెండ్ వేవ్ నేపథ్యంలో మహమ్మారిని ఎదుర్కొనేందుకు ఔరంగాబాద్‌లోని కొవిడ్ కేర్ సెంటర్‌ను అప్‌గ్రేడ్ చేయనున్నట్టు వెల్లడించింది. గతేడాది కంపెనీ చేపట్టిన కార్యక్రమాలకు అదనంగా ఈ చర్యలు ఉంటాయని బజాజ్ ఆటో ఓ ప్రకటనలో తెలిపింది. ఉద్యోగుల మానసిక, శారీరక భద్రతకు ప్రాధాన్యత ఇస్తామని, వారి ఆరోగ్యాన్ని రక్షించడం కంపెనీ బాధ్యతగా తీసుకుంటోందని పేర్కొంది. కొత్త విధానాల ప్రకారం.. కరోనా కారణంగా ఉద్యోగి మరణిస్తే వారి కుటుంబానికి రెండేళ్ల వరకు ఆర్థిక సహాయం కంపెనీ అందించనుంది. వారి పిల్లలు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసేంతవరకూ అండగా ఉంటుందని, ఉద్యోగి కుటుంబ సభ్యులందరికీ ఐదేళ్ల ఆసుపత్రి ఇన్సూరెన్స్ కూడా ఉంటుందని కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ రాజీవ్ బజాజ్ అన్నారు. వీటితో పాటు కంపెనీకి ఉన్న పలు కేర్ సెంటర్లలో టెస్టింగ్, ట్రీట్‌మెంట్ సౌకర్యాలు కలిపిస్తామని వెల్లడించింది.

Tags:    

Similar News