తెలంగాణలో బహుజన రాజ్యం స్థాపించాలి : RS ప్రవీణ్ కుమార్

దిశ, భువనగిరి రూరల్ : బహుమనీ సుల్తానులను ఎదిరించి గోల్కొండ కోటపై బహుజన రాజ్యాన్ని స్థాపించిన సర్వాయి పాపన్న గౌడ్ స్ఫూర్తితో తెలంగాణలో బహుజన రాజ్యం స్థాపించాలని బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర కో ఆర్డినేటర్ డా.ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో వందలాది మంది కార్యకర్తలు బీఎస్పీ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ దళిత బంధు పథకం పేరుతో వాసాలమర్రిలో నిర్వహించిన ప్రారంభోత్సవానికి, 3 కోట్ల రూపాయల […]

Update: 2021-09-03 11:42 GMT

దిశ, భువనగిరి రూరల్ : బహుమనీ సుల్తానులను ఎదిరించి గోల్కొండ కోటపై బహుజన రాజ్యాన్ని స్థాపించిన సర్వాయి పాపన్న గౌడ్ స్ఫూర్తితో తెలంగాణలో బహుజన రాజ్యం స్థాపించాలని బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర కో ఆర్డినేటర్ డా.ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు.

యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో వందలాది మంది కార్యకర్తలు బీఎస్పీ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ దళిత బంధు పథకం పేరుతో వాసాలమర్రిలో నిర్వహించిన ప్రారంభోత్సవానికి, 3 కోట్ల రూపాయల ప్రభుత్వ నిధులను ఆర్భాటాలకు వినియోగించారని దుయ్యబట్టారు.

వేలాది మంది బలిదానంతో కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతుందని విమర్శించారు. ఢిల్లీలో తెలంగాణ భవన్ నిర్మిస్తే ఆ పార్టీకి గొప్పతనం కాని బహుజనులకు ఏమి ఒరుగుతుందని విమర్శించారు. బహుజన సమాజ్ పార్టీ అధికారంలోకి వస్తే ఢిల్లీ కేంద్రంగా అంతర్జాతీయ ప్రమాణాలతో హాస్టల్ నిర్మించి వేలాది మంది పేద విద్యార్థులను ఐఏఎస్, ఐపీఎస్ లుగా తీర్చిదిద్దుతామని తెలిపారు.

Tags:    

Similar News