బద్వేల్ వైసీపీ అభ్యర్థిగా దాసరి సుధ.. టీడీపీ నుంచి ఎవరంటే.!
దిశ, ఏపీ బ్యూరో: ఏపీలో ఉపఎన్నికకు నగరా మోగింది. వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేల్ ఉపఎన్నికలకు కేంద్ర ఎన్నికల కమిషన్ మంగళవారం షెడ్యూల్ విడుదల చేసింది. అక్టోబర్ 30న ఉపఎన్నిక నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల కమిషన్ వెల్లడించింది. నవంబర్ 2న కౌంటింగ్ చేపట్టనున్నట్లు పేర్కొంది. దేశవ్యాప్తంగా 14 రాష్ట్రాలలోని 30 అసెంబ్లీ నియోజకవర్గాలకు, మూడు లోక్‌సభ స్థానాలకు ఉప ఎన్నిక నిర్వహించనున్నారు. బద్వేల్ నియోజకవర్గం ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య అనారోగ్యంతో మృతి చెందడంతో ఉపఎన్నిక అనివార్యమైంది. అయితే […]
దిశ, ఏపీ బ్యూరో: ఏపీలో ఉపఎన్నికకు నగరా మోగింది. వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేల్ ఉపఎన్నికలకు కేంద్ర ఎన్నికల కమిషన్ మంగళవారం షెడ్యూల్ విడుదల చేసింది. అక్టోబర్ 30న ఉపఎన్నిక నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల కమిషన్ వెల్లడించింది. నవంబర్ 2న కౌంటింగ్ చేపట్టనున్నట్లు పేర్కొంది. దేశవ్యాప్తంగా 14 రాష్ట్రాలలోని 30 అసెంబ్లీ నియోజకవర్గాలకు, మూడు లోక్‌సభ స్థానాలకు ఉప ఎన్నిక నిర్వహించనున్నారు. బద్వేల్ నియోజకవర్గం ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య అనారోగ్యంతో మృతి చెందడంతో ఉపఎన్నిక అనివార్యమైంది. అయితే ఈ ఉపఎన్నికను వైసీపీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుందని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించారు.
తాడేపల్లిలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. బద్వేల్ నియోజకవర్గం అభ్యర్థిగా దాసరి సుధ పోటీ చేస్తారని ప్రకటించారు. దాసరి సుధ దివంగత ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య భార్య అని వెల్లడించారు. ప్రజల అభిమానం, ఆదరణ తమ పార్టీకి ఎప్పుడూ ఉంటాయని.. నిష్పక్షపాతంగానే ఎన్నికలు జరగాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఉపఎన్నికను సీరియస్‌గా తీసుకుని, మంచి మెజార్టీతో గెలుస్తామని ప్రభుత్వ సలహాదారు సజ్జల ఆశాభావం వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే ఇప్పటికే తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని ఖరారు చేసింది. 2019 ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన ఓబుళాపురం రాజేశేఖర్‌ను మరోసారి బరిలోకి దించాలని చంద్రబాబు నిర్ణయించారు. ఇకపోతే బద్వేల్ ఉపఎన్నికకు సంబంధించి అక్టోబర్ 1న నోటిఫికేషన్ విడుదలవుతుంది. నామినేషన్ దాఖలుకు చివరి తేదీ అక్టోబర్ 8. అక్టోబర్ 11న నామినేషన్ల పరిశీలన.. అక్టోబర్ 13న ఉపసంహరణకు చివరి తేదీ. అక్టోబర్ 30న పోలింగ్ నిర్వహించగా.. నవంబర్ 2న కౌంటింగ్ నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రకటించింది.