భారీ బందోబస్తు మధ్య ప్రారంభమైన బద్వేల్ పోలింగ్
దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న బద్వేల్ ఉప ఎన్నిక పోలింగ్ ప్రారంభమైంది. శనివారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు ఈ పోలింగ్ జరగనుంది. ఈ మేరకు ఏపీ ఎన్నికల అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పకడ్భందీగా ఏర్పాట్లు చేశారు. కరోనా నిబంధనలతో ఈ ఎన్నికలను నిర్వహిస్తున్నారు. చివరి గంటలో కోవిడ్ బాధితులు పీపీఈ కిట్లతో ఓటు హక్కు వినియోగించుకునేలా అధికారులు […]
దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న బద్వేల్ ఉప ఎన్నిక పోలింగ్ ప్రారంభమైంది. శనివారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు ఈ పోలింగ్ జరగనుంది. ఈ మేరకు ఏపీ ఎన్నికల అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పకడ్భందీగా ఏర్పాట్లు చేశారు.
కరోనా నిబంధనలతో ఈ ఎన్నికలను నిర్వహిస్తున్నారు. చివరి గంటలో కోవిడ్ బాధితులు పీపీఈ కిట్లతో ఓటు హక్కు వినియోగించుకునేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. కాగా, బద్వేల్ నియోజకవర్గంలో 2,15,292 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. బరిలో అధికార వైసీపీ సహా 15 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఈ నియోజకవర్గంలో 281 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. వాటిలో 221 సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించి అదనపు బలగాలను మోహరించారు. కాగా, బద్వేలు నియోజకవర్గంలోని పోరు మామిళ్లలో అధికారులు ఏంజెట్లను పోలింగ్ కేంద్రంలోనికి అనుమతించలేదు. ఈ క్రమంలో అక్కడ ఇంకా పోలింగ్ ప్రారంభం కాలేదు.