కొవిడ్ దెబ్బకు ఆడకుండానే తిరిగొచ్చారు
దిశ, స్పోర్ట్స్: జర్మనీలో నిర్వహించిన సార్‌లోర్‌లక్స్ ఓపెన్ ఆడటానికి వెళ్లిన భారతీయ షట్లర్లు ఒక్క మ్యాచ్ అయినా ఆడకుండానే, స్వదేశానికి తిరిగొచ్చారు. ఈ టోర్నీలో ఆడటానికి లక్ష్య సేన్, శుభాంకర్ డే, అజయ్ జయరాంతోపాటు వారి కోచ్ డీకే సేన్, ఫిజియోథెరపిస్ట్ అభిషేక్ వాఘ్ జర్మనీ వెళ్లారు. అయితే, కోచ్ డీకే సేన్‌కు కరోనా పాజిటివ్‌గా తేలడంతో వారందరినీ క్వారంటైన్‌కు తరలించారు. మిగతా ఆటగాళ్లకు నెగెటివ్ వచ్చినా ముందస్తు జాగ్రత్తగా నిర్వాహకులు వారిని టోర్నీలో పాల్గొననివ్వలేదు. కాగా, […]
దిశ, స్పోర్ట్స్: జర్మనీలో నిర్వహించిన సార్‌లోర్‌లక్స్ ఓపెన్ ఆడటానికి వెళ్లిన భారతీయ షట్లర్లు ఒక్క మ్యాచ్ అయినా ఆడకుండానే, స్వదేశానికి తిరిగొచ్చారు. ఈ టోర్నీలో ఆడటానికి లక్ష్య సేన్, శుభాంకర్ డే, అజయ్ జయరాంతోపాటు వారి కోచ్ డీకే సేన్, ఫిజియోథెరపిస్ట్ అభిషేక్ వాఘ్ జర్మనీ వెళ్లారు.
అయితే, కోచ్ డీకే సేన్‌కు కరోనా పాజిటివ్‌గా తేలడంతో వారందరినీ క్వారంటైన్‌కు తరలించారు. మిగతా ఆటగాళ్లకు నెగెటివ్ వచ్చినా ముందస్తు జాగ్రత్తగా నిర్వాహకులు వారిని టోర్నీలో పాల్గొననివ్వలేదు. కాగా, ఐదు రోజుల క్వారంటైన్ అనంతరం అందరూ నెగెటివ్‌గా తేలారు. దీంతో బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (బాయ్) తమ ఆటగాళ్లను వెనక్కి పంపాలని బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ (బీడబ్ల్యూఎఫ్)ను కోరింది. వారందరి తిరుగు ప్రయాణానికి జర్మనీ ప్రభుత్వం నుంచి బీడబ్ల్యూఎఫ్ అనుమతులు తీసుకుంది. దీంతో వారు మంగళవారం ఉదయం ఇండియాకు చేరుకున్నారు. అనంతరం అందరినీ 7 రోజుల క్వారంటైన్‌కు తరలించారు.