అమెరికా వెళ్లాలనుకుంటున్న ఆ ప్రయాణికులకు చేదువార్త..
దిశ, వెబ్ డెస్క్ : రోజు రోజుకు కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. హైదరాబాద్ లో ఇంతకుఇంత పెరిగిపోతోన్న కరోనా కేసులను దృష్టిలో పెట్టుకొని అమెరికా కాన్సులేట్ కీలక నిర్ణయం తీసుకుంది. మే 3 నుంచి నాన్ ఇమిగ్రెంట్ వీసాల కోసం జరగాల్సిన ఇంటర్వ్యూలు, డ్రాప్‌బాక్స్ ప్రక్రియలను నిలిపివేస్తున్నట్టు హైదరాబాద్ లోని అమెరికా దౌత్య కార్యాలయం వెల్లడించింది. నాన్ ఇమిగ్రెంట్ వీసాల ఇంటర్వ్యూలను తిరిగి ఎప్పుడు నిర్వహించేది తర్వాత ప్రకటిస్తామని, ఇప్పటికే తీసుకున్న ఇంటర్వ్యూలను మాత్రం సాధ్యమైనంత వరకు […]
దిశ, వెబ్ డెస్క్ : రోజు రోజుకు కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. హైదరాబాద్ లో ఇంతకుఇంత పెరిగిపోతోన్న కరోనా కేసులను దృష్టిలో పెట్టుకొని అమెరికా కాన్సులేట్ కీలక నిర్ణయం తీసుకుంది. మే 3 నుంచి నాన్ ఇమిగ్రెంట్ వీసాల కోసం జరగాల్సిన ఇంటర్వ్యూలు, డ్రాప్‌బాక్స్ ప్రక్రియలను నిలిపివేస్తున్నట్టు హైదరాబాద్ లోని అమెరికా దౌత్య కార్యాలయం వెల్లడించింది. నాన్ ఇమిగ్రెంట్ వీసాల ఇంటర్వ్యూలను తిరిగి ఎప్పుడు నిర్వహించేది తర్వాత ప్రకటిస్తామని, ఇప్పటికే తీసుకున్న ఇంటర్వ్యూలను మాత్రం సాధ్యమైనంత వరకు అనుమతించనున్నట్లు తెలిపారు.