అంతరిక్షంలో బేబీ యోధ
దిశ, వెబ్‌డెస్క్ : అమెరికా సంస్థ ‘స్పేస్ ఎక్స్’కు చెందిన ఫాల్కన్ రాకెట్ నలుగురు ఆస్ట్రోనాట్లతో విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లి సరికొత్త అధ్యయానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. నలుగురు ఆస్ట్రోనాట్లు ఆరు నెలలపాటు అంతరిక్ష ప్రయోగ కేంద్రంలో పరిశోధనలు చేయనున్నారు. ఈ ఆస్ట్రోనాట్లతో పాటు ‘బేబీ యోధ’ కూడా అంతరిక్షంలోకి వెళ్లింది. ఇంతకీ ఆ బేబీ యోధ కథేంటి? ‘ద మండలోరియన్’అనేది అమెరికా టెలివిజన్ సిరీస్. డిస్నీ ప్లస్ నిర్మించిన ఈ సిరీస్ 2019 నవంబర్ […]
దిశ, వెబ్‌డెస్క్ : అమెరికా సంస్థ ‘స్పేస్ ఎక్స్’కు చెందిన ఫాల్కన్ రాకెట్ నలుగురు ఆస్ట్రోనాట్లతో విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లి సరికొత్త అధ్యయానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. నలుగురు ఆస్ట్రోనాట్లు ఆరు నెలలపాటు అంతరిక్ష ప్రయోగ కేంద్రంలో పరిశోధనలు చేయనున్నారు. ఈ ఆస్ట్రోనాట్లతో పాటు ‘బేబీ యోధ’ కూడా అంతరిక్షంలోకి వెళ్లింది. ఇంతకీ ఆ బేబీ యోధ కథేంటి?
‘ద మండలోరియన్’అనేది అమెరికా టెలివిజన్ సిరీస్. డిస్నీ ప్లస్ నిర్మించిన ఈ సిరీస్ 2019 నవంబర్ 12న విడుదలైంది. స్టార్ వార్స్ ఫ్రాంచైజ్ సిరీస్‌లలో ఇదే మొదిటి లైవ్ – యాక్షన్ సిరీస్. స్టార్ వార్ క్రియేటర్ జార్జ్ ల్యూకస్ ఆలోచనల్లోంచి లైవ్ -యాక్షన్ టెలీవిజన్ సిరీస్ పురుడుపోసుకుంది. 2009 నుంచి ఆయన ఈ కథను రాసుకున్నాడు. బడ్జెట్ తన అంచనాలకు మించడంతో, అక్టోబర్ 2012లో ఆ కథను డిస్నీకి అమ్మేశాడు. 2019లో ఆ కథతో ‘ద మండలోరియన్’ పేరుతో టెలీవిజన్ సిరీస్ విడుదల చేయగా, బిగ్ సక్సెస్ అందుకుంది.
72వ ప్రైమ్ టైమ్ ఎమ్మీ అవార్స్డ్‌లో ఏకంగా ఏడు అవార్డులు గెలుచుకుంది. స్టార్ వార్ ఫిక్షనల్ క్యారెక్టర్ ‘ద చైల్డ్ (బేబీ యోద)ను ల్యూకస్ తన మండలోరియన్‌లోనూ కొనసాగించాడు. ఇందులో ఏలియన్ స్పీసియెస్ ‘బేబీ యోధ’ కీలకమైన పాత్ర పోషించింది. ఈ సిరీస్ విజయవంతమైన తర్వాత బేబీ యోధ పేరుతో మార్కెట్లోకి బోలెడు టాయ్స్ వచ్చాయి. ఫాల్కనర్ రాకెట్లో అంతరిక్షానికి ప్రయాణమైన ఆస్ట్రోనాట్లు, తమతోపాటు బేబీ యోధ టాయ్‌ను కూడా స్పేస్‌లోకి తీసుకెళ్లారు.
స్పేస్ ఎక్స్ టీమ్‌తోపాటు లైవ్‌లో ఉన్న బేబీ యోధ టాయ్ నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ‘బ్రేకింగ్ న్యూస్ : బేబీ యోధ ఇప్పుడు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌లో ఉంది’ అని కామెంట్లు చేస్తున్నారు. ఆస్ట్రోనాట్లు తమ వెంట టాయ్స్ తీసుకు వెళ్లడం ఇదేం కొత్త కాదు. సాఫ్ట్ టాయ్స్‌ను గ్రావిటీ ఇండికేటర్స్‌గా ఉపయోగిస్తారు. అందుకోసమే అంతరిక్షానికి టాయ్స్ తీసుకెళుతుంటారు.