సాగర కన్యకు జన్మనిచ్చిన తెలంగాణ మహిళ

దిశ, వెబ్‌డెస్క్ : ఇటీవల వింత జననాల సంఖ్య పెరిగిపోతోంది. జంతువుల కడుపులో మనిషి ఆకారంలో జన్మించడం.. మనిషి గర్భం నుంచి జంతువుల ఆకారంలో శిశువులు జన్మించడం సర్వసాధారణం అయింది. తాజాగా హైదరాబాద్ నడిబొడ్డున ఓ మహిళ సాగర కన్య ఆకారంలో ఉన్న శిశువుకు జన్మనిచ్చింది. ప్రైవేట్ ఆస్పత్రిలో జరిగిన డెలివరీకి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. సంగారెడ్డి జిల్లాకు చెందిన ఓ మహిళ నిండు గర్భిణి. ఆమెకు బుధవారం సాయంత్రం పురిటి నొప్పులు రావడంతో హైకోర్టు […]

Update: 2021-03-11 07:03 GMT

దిశ, వెబ్‌డెస్క్ : ఇటీవల వింత జననాల సంఖ్య పెరిగిపోతోంది. జంతువుల కడుపులో మనిషి ఆకారంలో జన్మించడం.. మనిషి గర్భం నుంచి జంతువుల ఆకారంలో శిశువులు జన్మించడం సర్వసాధారణం అయింది. తాజాగా హైదరాబాద్ నడిబొడ్డున ఓ మహిళ సాగర కన్య ఆకారంలో ఉన్న శిశువుకు జన్మనిచ్చింది. ప్రైవేట్ ఆస్పత్రిలో జరిగిన డెలివరీకి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

సంగారెడ్డి జిల్లాకు చెందిన ఓ మహిళ నిండు గర్భిణి. ఆమెకు బుధవారం సాయంత్రం పురిటి నొప్పులు రావడంతో హైకోర్టు సమీపంలోని ఓ ఆస్పత్రికి తీసుకోచ్చారు. మహిళకు డెలివరీ చేసిన డాక్టర్లు శిశువును చూసి షాక్ అయ్యారు. పుట్టిన బిడ్డ చేప ఆకారంలో ఉండడంతో ఆశ్చర్యానికి గురయ్యారు. నడుము భాగం వరకు శిశువు మనిషి ఆకారంలో ఉన్నా.. జననేంద్రియాలు, కాళ్లు అభివృద్ధి చెందలేదు. నడుము కింది భాగం మొత్తం సాగర కన్య (చేప) ఆకారంలో ఉన్నది. శిశువు పుట్టిన కొద్ది గంటల్లోనే ప్రాణాలు వదిలింది. తల్లి ఆరోగ్యంగానే ఉన్నదని వైద్యులు తెలిపారు. జన్యుపరమైన లోపాలతోనే ఇలా జన్మిస్తారని డాక్టర్లు పేర్కొన్నారు.

Tags:    

Similar News