షాకింగ్: ఓటమి భరించలేక బబితా ఫోగాట్ సోదరి ఆత్మహత్య

దిశ,వెబ్ డెస్క్: యావత్ క్రీడా ప్రపంచంలో విషాదం చోటుచేసుకుంది. ఓటమిని భరించలేక యువ రెజ్లింగ్ ఛాంపియన్ రితికా ఫోగాట్ ఆత్మహత్య చేసుకుంది. రెజ్లింగ్ ఛాంపియన్ బబితా ఫోగాట్, గీతా ఫోగాట్ లకు ఈమె సోదరి. ప్రస్తుతం రితికా స్టేట్ లెవెల్ జూనియర్ రెస్లింగ్ లో ఆడుతోంది. ఈ క్రమంలో రితికా తాజాగా భరత్‌పూర్‌లోని లోహ్‌ఘర్‌ స్టేడియంలో మార్చి 12 నుంచి 14 వరకు జరిగిన రాష్ట్ర స్థాయి జూనియర్‌ ఉమెన్‌, సబ్‌ జూనియర్‌ పోటీల్లో పాల్గొంది. చివరి […]

Update: 2021-03-18 00:35 GMT

దిశ,వెబ్ డెస్క్: యావత్ క్రీడా ప్రపంచంలో విషాదం చోటుచేసుకుంది. ఓటమిని భరించలేక యువ రెజ్లింగ్ ఛాంపియన్ రితికా ఫోగాట్ ఆత్మహత్య చేసుకుంది. రెజ్లింగ్ ఛాంపియన్ బబితా ఫోగాట్, గీతా ఫోగాట్ లకు ఈమె సోదరి. ప్రస్తుతం రితికా స్టేట్ లెవెల్ జూనియర్ రెస్లింగ్ లో ఆడుతోంది. ఈ క్రమంలో రితికా తాజాగా భరత్‌పూర్‌లోని లోహ్‌ఘర్‌ స్టేడియంలో మార్చి 12 నుంచి 14 వరకు జరిగిన రాష్ట్ర స్థాయి జూనియర్‌ ఉమెన్‌, సబ్‌ జూనియర్‌ పోటీల్లో పాల్గొంది. చివరి మ్యాచ్ లో ఒక్క పాయింట్ తేడాతో ఓటమిని చవిచూసిన రితికా తీవ్ర మనస్తాపానికి గురైంది. ఈ నేపథ్యంలోనే మార్చి 15 న ఆమె స్వంత గ్రామమైన బలాలి లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది.

ఆటలన్నాకా గెలుపు ఓటములు సహజం. ఒక చిన్న ఓటమికే రితికా ప్రాణాలు తీసుకోవడం బాధాకరమైన విషయమంటూ పలువురు క్రీడా ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఇక తాజాగా రితికా మృతికి రోడ్డు రవాణా, రహదారుల శాఖ సహాయ మంత్రి విజయ్ కుమార్ సింగ్ ట్విట్టర్ వేదికగా సంతాపం తెలిపారు. “ఎంతో మంచి భవిష్యత్తు ఉన్న రితికా మృతి చెందింది అని చెప్పడానికి చింతిస్తున్నాను. ప్రపంచం అంతకు ముందులా లేదు. క్రీడాకారుల మీద ఒత్తిడి ఎక్కువయ్యింది. ఆ ఒత్తిడిని ఎదుర్కొనే విధంగా వారికి ప్రత్యేక శిక్షణ అందించడం ఎంతో అవసరం” అంటూ ట్వీట్ చేసారు. ఇకపోతే మహావీర్ ఫోగాట్, ఆయన కూతుళ్ళ కథతోనే హిందీ లో ‘దంగల్’ మూవీ తెరకెక్కిన విషయం తెలిసిందే.

Tags:    

Similar News