కోహ్లీ వన్డే ర్యాంకుకు ముప్పు
దిశ, స్పోర్ట్స్ : టీమ్ ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రస్తుతం ఐసీసీ వన్డే బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో ఉన్నాడు. ఇటీవల ముగిసిన ఇంగ్లాండ్ వన్డే సిరీస్‌లో రెండు అర్థసెంచరీలు చేయడంతో అతడు తిరిగి టాప్ ర్యాంకుకు చేరుకున్నాడు. అయితే ఇప్పుడు పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ అజమ్ రూపంలో అతడి ర్యాంకుకు ముప్పు పొంచి ఉన్నది. బుధవారం దక్షిణాఫ్రికాతో ముగిసిన వన్డే సిరీస్‌లో పాకిస్తాన్ జట్టు 2-1 తేడాతో గెలుపొందింది. తొలి వన్డేలో సెంచరీ, రెండో వన్డేలో […]
దిశ, స్పోర్ట్స్ : టీమ్ ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రస్తుతం ఐసీసీ వన్డే బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో ఉన్నాడు. ఇటీవల ముగిసిన ఇంగ్లాండ్ వన్డే సిరీస్‌లో రెండు అర్థసెంచరీలు చేయడంతో అతడు తిరిగి టాప్ ర్యాంకుకు చేరుకున్నాడు. అయితే ఇప్పుడు పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ అజమ్ రూపంలో అతడి ర్యాంకుకు ముప్పు పొంచి ఉన్నది. బుధవారం దక్షిణాఫ్రికాతో ముగిసిన వన్డే సిరీస్‌లో పాకిస్తాన్ జట్టు 2-1 తేడాతో గెలుపొందింది. తొలి వన్డేలో సెంచరీ, రెండో వన్డేలో 31, మూడో వన్డేలో 94 పరుగులు చేసిన బాబర్ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు.
కోహ్లీ ప్రస్తుతం 857 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. బాబర్ అజమ్ అతని కంటే కేవలం 5 పాయింట్లే తక్కువగా ఉన్నాడు. సఫారీలతో జరిగిన సిరీస్‌లో రాణించడంతో అతడికి మరిన్ని ర్యాంకింగ్ పాయింట్లు లభించనున్నాయి. దీంతో అతడు కోహ్లీని అధిగమించి టాప్ ర్యాంకుకు చేరుకుంటాడు. అయితే ఐసీసీ వచ్చే వారం ఈ ర్యాంకులను అధికారికంగా ప్రకటించనున్నది. బాబర్ ఈ ర్యాంకును సుదీర్ఘ కాలం కాపాడుకోనున్నాడు. విరాట్ కోహ్లీ ఈ మధ్య కాలంలో ఎలాంటి వన్డే సిరీస్‌లు ఆడబోవడం లేదు. దీంతో ఇప్పట్లో బాబర్ ర్యాంకుకు వచ్చే ముప్పేమీ లేదు.