ప్రాణం తీసిన ఆన్ లైన్ గేమ్

దిశ, వెబ్‌డెస్క్: ఆన్ లైన్ గేమ్ ఓ యువకుడి నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. గేమ్ ఆడేందుకు చేసిన రూ.15 లక్షల అప్పును తల్లిదండ్రులు తీర్చడంతో మనస్తాపానికి గురైన బీటెక్ విద్యార్థి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన మంచిర్యాల జిల్లాలో విషాదం నింపింది. జిల్లాలోని లక్షెట్టిపేట మున్సిపాలిటీ పరిధిలోని మోదెల గ్రామానికి చెందిన తోట శంకర్ దంపతులకు ఒక కుమారుడు, ఒక కుమార్తె. కొడుకు మధుకర్ బీటెక్ చదువుతున్నాడు. అదే సమయంలో ఇతను ఆన్ […]

Update: 2020-07-11 11:45 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఆన్ లైన్ గేమ్ ఓ యువకుడి నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. గేమ్ ఆడేందుకు చేసిన రూ.15 లక్షల అప్పును తల్లిదండ్రులు తీర్చడంతో మనస్తాపానికి గురైన బీటెక్ విద్యార్థి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన మంచిర్యాల జిల్లాలో విషాదం నింపింది. జిల్లాలోని లక్షెట్టిపేట మున్సిపాలిటీ పరిధిలోని మోదెల గ్రామానికి చెందిన తోట శంకర్ దంపతులకు ఒక కుమారుడు, ఒక కుమార్తె. కొడుకు మధుకర్ బీటెక్ చదువుతున్నాడు. అదే సమయంలో ఇతను ఆన్ లైన్ డఫ్పా‌గేమ్‌కు అలవాటు పడ్డాడు. స్నేహితుల వద్ద అప్పులు చేసి మరీ ఆడటంతో రూ. 15లక్షల వరకు అప్పులయ్యాయి. ఈ విషయం కాస్త తల్లిదండ్రులకు తెలియడంతో ఒకే కుమారుడని మందలించి ఆ అప్పులు మొత్తం కట్టారు. దీంతో మధుకర్ తన తల్లిదండ్రులను అప్పులపాలు చేశానని మనస్తాపం చెంది గత మూడు రోజుల కిందట పురుగుల మందు తాగాడు. వెంటనే అతన్ని కరీంనగర్‌లోని ఓ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో మృతి చెందాడు. దీంతో ‌ఆ గ్రామం మొత్తం విషాదంలో మునిగిపోయింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Tags:    

Similar News