అజార్.. ఒక స్కూటర్ జ్ఞాపకం
దిశ, స్పోర్ట్స్ : టీమ్ ఇండియా మాజీ కెప్టెన్, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు మహ్మద్ అజారుద్దీన్ కొన్ని రోజులుగా ట్విట్టర్ వేదికగా తన గత స్మృతులను నెమరు వేసుకుంటున్నాడు. క్రికెట్ ఆడే సమయంలో తాను సాధించిన బహుమతులు, తాను ఉపయోగించి బ్యాట్ల గురించి అభిమానులతో పంచుకుంటున్నాడు. మొదటిగా 1984-85 సీజన్‌లో అతడు ఉపయోగించిన బ్యాట్‌ను ట్విట్టర్‌లో పోస్టు చేశాడు. ‘ఈ బ్యాట్‌తో వరుసగా మూడు సెంచరీలు కొట్టి టెస్టుల్లో ప్రపంచ రికార్డు సాధించాడు. ఒక సీజన్‌లో […]
దిశ, స్పోర్ట్స్ : టీమ్ ఇండియా మాజీ కెప్టెన్, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు మహ్మద్ అజారుద్దీన్ కొన్ని రోజులుగా ట్విట్టర్ వేదికగా తన గత స్మృతులను నెమరు వేసుకుంటున్నాడు. క్రికెట్ ఆడే సమయంలో తాను సాధించిన బహుమతులు, తాను ఉపయోగించి బ్యాట్ల గురించి అభిమానులతో పంచుకుంటున్నాడు. మొదటిగా 1984-85 సీజన్‌లో అతడు ఉపయోగించిన బ్యాట్‌ను ట్విట్టర్‌లో పోస్టు చేశాడు. ‘ఈ బ్యాట్‌తో వరుసగా మూడు సెంచరీలు కొట్టి టెస్టుల్లో ప్రపంచ రికార్డు సాధించాడు. ఒక సీజన్‌లో 800 కంటే ఎక్కువ పరుగులు ఇదే బ్యాట్‌తో కొట్టాను. ఇదంటే నాకు చాలా ఇష్టం. ఈ బ్యాట్‌ను ఎంపిక చేసి ఇచ్చింది మా తాతయ్య’ అని చెప్పాడు.
అలాగే తన వద్ద ఎప్పటి నుంచో ఉంటున్న ప్రియ స్కూటర్‌తో కలసి దిగిన ఫొటోను కూడా పెట్టాడు. ఈ స్కూటర్‌తో ఎన్నో మధురానుభూతులు ఉన్నాయని అజార్ చెప్పాడు. నేను క్రికెట్ ఆడే తొలి నాళ్లలో నా క్రికెటింగ్ టాలెంట్‌కు గుర్తుగా ఈ స్కూటర్ బహుమతిగా వచ్చింది. అప్పట్లో నేను నడుచుకుంటూ కొన్నిసార్లు సైకిల్‌పై క్రికెట్ ప్రాక్టీస్‌కి వెళ్లేవాడిని. కానీ ఈ స్కూటర్ వచ్చిన తర్వాత నాకు చాలా సౌకర్యంగా అనిపించింది. సమయం ఆదా అవడంతో పాటు నడిచే అవసరం రాలేదు అని ట్వీట్ చేశాడు.