పాక్‌ను గెలిపించిన బాబర్ ఆజమ్
దిశ, స్పోర్ట్స్: దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లిన పాకిస్తాన్ జట్టు విజయంతో సిరీస్ ఆరంభించింది. శుక్రవారం జరిగిన తొలి వన్డేలో పాకిస్తాన్ జట్టు మూడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. చివరి బంతి వరకు పూర్తి ఉత్కంటగా మ్యాచ్ సాగింది. తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లు నష్టానికి 273 పరుగులు చేసింది. డస్సెన్ అజేయంగా 123 పరుగులు చేసి జట్టును ఆదుకున్నాడు. అతడికి మిల్లర్ (50) జత కలవడంతో సఫారీలు […]
దిశ, స్పోర్ట్స్: దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లిన పాకిస్తాన్ జట్టు విజయంతో సిరీస్ ఆరంభించింది. శుక్రవారం జరిగిన తొలి వన్డేలో పాకిస్తాన్ జట్టు మూడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. చివరి బంతి వరకు పూర్తి ఉత్కంటగా మ్యాచ్ సాగింది. తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లు నష్టానికి 273 పరుగులు చేసింది. డస్సెన్ అజేయంగా 123 పరుగులు చేసి జట్టును ఆదుకున్నాడు.
అతడికి మిల్లర్ (50) జత కలవడంతో సఫారీలు గౌరవ ప్రదమైన స్కోర్ సాధించింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన పాకిస్తాన్ జట్టును ఇమాముల్ హల్ (70), బాబర్ ఆజమ్ (103) విజయతీరాకు చేర్చాడు. వికెట్లు కోల్పోయి తడబడిన పాకిస్తాన్‌ను ఆజమ్ తన ఇన్నింగ్స్‌తో విజయతీరాలకు చేర్చాడు. బాబర్ ఇన్నింగ్స్‌లో 17 ఫోర్లు ఉండటం గమనార్హం.