అందరిలాగే నా లక్ష్యం బిగ్ బీ : ఆయుష్మాన్

బిగ్ బీ అమితాబ్ బచ్చన్, ఆయుష్మాన్ ఖురానా నటించిన చిత్రం ‘గులాబో సితాబో’. నేరుగా అమెజాన్ ప్రైమ్‌లో రిలీజైన తొలి హిందీ చిత్రం ఇదే కావడం విశేషం. ఈ అనుభవం గురించి బచ్చన్ ఇంతకుముందే అభిమానులతో పంచుకున్నాడు. ‘నా సినీ ప్రయాణంలో ఇది మరొక సవాల్’ అని తెలిపాడు. కాగా అమితాబ్‌తో ఈ సినిమా ప్రయాణాన్ని పూర్వజన్మ సుకృతంగా అభివర్ణిస్తూ డైరెక్టర్ సుజిత్ సర్కార్‌కు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు ఆయుష్మాన్. అంతేకాకుండా అమితాబ్‌ను ఎంతగా ఆరాధిస్తాడో సోషల్ […]

Update: 2020-06-12 03:13 GMT

బిగ్ బీ అమితాబ్ బచ్చన్, ఆయుష్మాన్ ఖురానా నటించిన చిత్రం ‘గులాబో సితాబో’. నేరుగా అమెజాన్ ప్రైమ్‌లో రిలీజైన తొలి హిందీ చిత్రం ఇదే కావడం విశేషం. ఈ అనుభవం గురించి బచ్చన్ ఇంతకుముందే అభిమానులతో పంచుకున్నాడు. ‘నా సినీ ప్రయాణంలో ఇది మరొక సవాల్’ అని తెలిపాడు.

కాగా అమితాబ్‌తో ఈ సినిమా ప్రయాణాన్ని పూర్వజన్మ సుకృతంగా అభివర్ణిస్తూ డైరెక్టర్ సుజిత్ సర్కార్‌కు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు ఆయుష్మాన్. అంతేకాకుండా అమితాబ్‌ను ఎంతగా ఆరాధిస్తాడో సోషల్ మీడియా వేదికగా తెలిపాడు. ‘ఇండస్ట్రీకి రావాలనుకునే ప్రతీ కుర్రాడి లక్ష్యం ఒక్కటే.. అమితాబ్ బచ్చన్. కానీ నా చివరి సినిమాలో చెప్పినట్లు బచ్చన్‌ను తయారు చేయలేం’ అన్నాడు.

‘అమితాబ్ ఉన్నాడని.. నేను చిన్నతనంలో చండీగఢ్‌లోని నీలం సినిమా హాల్‌లో ‘హమ్’ సినిమా చూశాను. ‘బిగ్ బీ’ని అంత పెద్ద స్క్రీన్ పై చూసినప్పుడు నా శరీరంలో ఏదో శక్తి ఉత్పన్నమైంది.. అదే నన్ను నటుడిగా మారేందుకు ప్రోత్సహించింది. ఎక్కడైతే నా తొలి సీరియల్ ముఖేష్ మిల్జ్ షూటింగ్ జరిగిందో.. అక్కడే నా తొలి సినిమా షూటింగ్ ‘జుమ్మా చుమ్మా దే దే’ షూటింగ్ జరిగింది. ఆ రోజు హా.. నేను వచ్చేశా అనే ఫీలింగ్ కలిగింది. కానీ నేను ఇక్కడికి వచ్చేందుకు స్ఫూర్తినిచ్చిన అమితాబ్ బచ్చన్‌తో స్క్రీన్ షేర్ చేసుకోవడం.. నేను ఇప్పుడు ఎలాంటి ఫీలింగ్‌తో ఉన్నానో’ అర్థం చేసుకోవచ్చిని తెలిపాడు. ‘ఇంత గొప్ప అనుభవాన్ని ఇచ్చిన దర్శకుడికి ధన్యవాదాలు. దాదా మీరే నా గురువు. మీ చేయి పట్టుకునే నేనిక్కడి వరకూ వచ్చాను’ అని ట్వీట్ చేశాడు.

ఈ పుట్టుకను పొందడానికి వంద జన్మల త్యాగాలు.. నైపుణ్యాన్ని ప్రదర్శించేందుకు జీవితం వేలాది అవకాశాలు ఇచ్చిందని తెలిపిన ఆయుష్మాన్.. గులాబో సితాబో ద్వారా తన కల నెరవేరిందని ఆనందం వ్యక్తం చేశాడు.

Tags:    

Similar News