ఆనందయ్య మందు హానికరం కాదు.. ఆయుష్ కమిషనర్ క్లారిటీ
దిశ, వెబ్‌డెస్క్: నెల్లూరు కృష్ణపట్నంకు చెందిన ఆయుర్వేద వైద్యులు ఆనందయ్య కరోనా మందుపై ఆయూష్ కమిషనర్ రాములు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆనందయ్య మందు తయారీలో వాడే పదార్థాలన్నీ ఆయుర్వేదంలో వినియోగించేవే అని అన్నారు. ఆయుర్వేదంగా గుర్తింపు ఇచ్చే అంశం రాష్ట్ర పరిధిలో ఉంటుందని స్పష్టం చేశారు. కానీ, ఇందులో కేంద్రం సహాయం తీసుకుంటామని వెల్లడించారు. ఆనందయ్య మందుపై అధ్యయన ప్రక్రియ ఇంకా కొనసాగుతోందని.. ప్రస్తుతానికి ఆనందయ్య మందును ఆయుర్వేదంగా గుర్తించలేం, కానీ త్వరలో గుర్తించే అవకాశం […]
దిశ, వెబ్‌డెస్క్: నెల్లూరు కృష్ణపట్నంకు చెందిన ఆయుర్వేద వైద్యులు ఆనందయ్య కరోనా మందుపై ఆయూష్ కమిషనర్ రాములు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆనందయ్య మందు తయారీలో వాడే పదార్థాలన్నీ ఆయుర్వేదంలో వినియోగించేవే అని అన్నారు. ఆయుర్వేదంగా గుర్తింపు ఇచ్చే అంశం రాష్ట్ర పరిధిలో ఉంటుందని స్పష్టం చేశారు. కానీ, ఇందులో కేంద్రం సహాయం తీసుకుంటామని వెల్లడించారు. ఆనందయ్య మందుపై అధ్యయన ప్రక్రియ ఇంకా కొనసాగుతోందని.. ప్రస్తుతానికి ఆనందయ్య మందును ఆయుర్వేదంగా గుర్తించలేం, కానీ త్వరలో గుర్తించే అవకాశం ఉందని అన్నారు. మందు తయారీ విధానాన్ని బహిరంగ పర్చేందుకు ఆనందయ్య అంగీకరించారని తెలిపారు.
ఆనందయ్య ఇచ్చే ఐ డ్రాప్స్‌లో కూడా ఎలాంటి హానీకారకాలు లేవని స్పష్టం చేశారు. తేనె, ముళ్ల వంకాయ, తోక మిరియాల మిశ్రమంతో ఐ డ్రాప్స్ తయారు చేస్తున్నారని వెల్లడించారు. ఐ డ్రాప్స్ వల్ల ఇబ్బందులు ఉండవని, ఆయుర్వేద వైద్యుల బృందం నిర్ధారించిందని అన్నారు. ఆనందయ్య వాడుతున్న వివిధ పదార్థాల మిశ్రమంతో.. ఎలాంటి ఎఫెక్ట్ ఉండదని ల్యాబ్ టెస్టుల ద్వారా నిర్ధారణ అయినట్టు తెలిపారు. ప్రస్తుతం ఆనందయ్య వద్ద ఎవరెవరు మందులు తీసుకున్నారో వారి వివరాలు సేకరించే ప్రయత్నం చేస్తున్నామని అన్నారు.
సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఆయుర్వేదిక్ స్టడీక్‌కు ఆనందయ్య మందుకు సంబంధించిన డేటా అందజేస్తామని, ఆ బృందం పూర్తిగా అధ్యయనం చేస్తుందని వెల్లడించారు. జిల్లెడు పువ్వులను శాస్త్రం ప్రకారం ఉపయోగిస్తే మందుగా ఉపయోగించవచ్చునని అన్నారు. ఆనందయ్య మందు వాడాకా కొందరికి ఇబ్బందులు వచ్చాయనే వార్త తామూ విన్నామని, అయితే మందు తీసుకున్నాక, ఫాలో కావాల్సిన నియమాలు ఫాలో అయ్యారో లేదో చూడాల్సి ఉంటుందని తెలిపారు. కృష్ణపట్నం.. ఆ చుట్టు పక్కల గ్రామాల్లో కరోనా పాజిటివ్ కేసులు తక్కువగా ఉన్నాయని, మరీ ముఖ్యంగా ఒక్క కరోనా మరణం కూడా సంభవించలేదని అన్నారు. సమగ్ర విచారణ జరిపి ఇవాళ సాయంత్రానికల్లా నివేదిక ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తామని స్పష్టం చేశారు.