మొదలైన ఆనందయ్య మందు పంపిణీ.. కృష్ణపట్నం నిండా జనం

దిశ, వెబ్‌డెస్క్: కరోనాను కట్టడి చేసేందుకు నెల్లూరు జిల్లా కృష్ణపట్నంకు చెందిన ఆయుర్వేద వైద్యుడు ఆనందయ్య ఆయుర్వేద మందు తయారుచేసిన విషయం తెలిసిందే. దీంతో ఆనందయ్య తయారు తయారు చేసిన మందు పంపిణీకి ప్రభుత్వం ఆమోదం తెలుపడంతో నేటినుంచి(శుక్రవారం) పంపిణీ మొదలైంది. నేడు కేవలం కరోనా పాజిటివ్ ఉన్న బాధితులకు మాత్రమే పంపిణీ చేస్తామని నిన్న(గురువారం) నిర్వాహకులు ప్రకటించడంతో ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున అంబులెన్సులు, ఇతర వాహనాల్లో బాధితులు కృష్ణపట్నంకు […]

Update: 2021-05-21 00:26 GMT

దిశ, వెబ్‌డెస్క్: కరోనాను కట్టడి చేసేందుకు నెల్లూరు జిల్లా కృష్ణపట్నంకు చెందిన ఆయుర్వేద వైద్యుడు ఆనందయ్య ఆయుర్వేద మందు తయారుచేసిన విషయం తెలిసిందే. దీంతో ఆనందయ్య తయారు తయారు చేసిన మందు పంపిణీకి ప్రభుత్వం ఆమోదం తెలుపడంతో నేటినుంచి(శుక్రవారం) పంపిణీ మొదలైంది. నేడు కేవలం కరోనా పాజిటివ్ ఉన్న బాధితులకు మాత్రమే పంపిణీ చేస్తామని నిన్న(గురువారం) నిర్వాహకులు ప్రకటించడంతో ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున అంబులెన్సులు, ఇతర వాహనాల్లో బాధితులు కృష్ణపట్నంకు చేరుకున్నారు. ఎక్కడెక్కడి నుంచో కరోనా బాధితులు కృష్ణ పట్టణానికి చేరుకుంటుండడంతో స్థానికుల్లో ఆందోళన వ్యక్తమైంది. గ్రామంలో ఎటుచూసినా కరోనా బాధితుల నిండిపోవడంతో పెద్ద ఎత్తున పోలీసు బలగాలను అధికారులు మోహరించారు.

Tags:    

Similar News