అయోధ్య అతిథులకు స్పెషల్ ప్రసాదాలు.. మొత్తం ఎన్ని రకాలు అంటే..?

అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం కన్నుల పండుగగా జరిగింది.

Update: 2024-01-22 12:38 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం కన్నుల పండుగగా జరిగింది. హిందువుల చిరకాల స్వప్నమైన రామమందిర కల సాకారమైన మహా ఘట్టాన్ని ప్రత్యక్షంగా వీక్షించేందుకు దాదాపు 7 వేల మంది ప్రముఖులకు ఆహ్వానాలు అందాయి. అయితే ఈ కార్యక్రమానికి వచ్చిన అతిథులకు శ్రీరామ జన్మభూమి తీర్థ ట్రస్టు ఏడు రకాల ప్రసాదాలను అందించారు. ప్రత్యేకంగా తయారు చేసిన బాక్స్‌ను అతిథులకు పంపిణీ చేశారు. ఇందులో నేతితో చేసిన రెండు లడ్డూలు, బెల్లం రేవ్ డీ, రామదాన చిక్కీ, అక్షింతలు, కుంకుమ, తులసీదళం, యాలకులతో పాటు రాముడి దీపం ప్రమిధను ఇచ్చారు. కాషాయ రంగులో ఉండే ప్రత్యేకమైన బాక్సులో వీటిని అతిథులకు అందజేశారు. ఈ బాక్సుపై శ్రీ రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు, హనుమాన్ గర్హీ లోగోలు ఉన్నాయి. ఈ ప్రసాదం బాక్సులను లక్నోకు చెందిన ప్రముఖ స్వీట్ షాప్ ఛప్పన్ భోగ్ సిద్ధం చేసింది.

Tags:    

Similar News