అయోధ్యలో కొలువుదీరిన బాల రాముడు.. ఆభరణాల సీక్రెట్ రివీల్

అయోధ్యలో 500 ఏళ్ల తర్వాత రామ మందిర ప్రాణ ప్రతిష్ట కన్నుల పండువగా జరిగింది.

Update: 2024-01-22 13:34 GMT

దిశ, వెబ్‌డెస్క్ : అయోధ్యలో 500 ఏళ్ల తర్వాత రామ మందిర ప్రాణ ప్రతిష్ట కన్నుల పండువగా జరిగింది. 12.29 నిమిషాలకు అభిజిత్ లగ్నంలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ట జరిగింది. అయితే బాల రాముడి ముఖం, కళ్లు చూస్తుంటే చూడాలనిపించేలా ఉన్నాయి. బాలరాముడి ఆభరణాలు విగ్రహానికి స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచాయి. ఆభరణాలు చూసిన చాలా మంది ఎంత అద్భుతంగా తయారు చేశారో అని మురిసిపోయారు. అయితే ఆభరణాల సీక్రెట్‌ను రామ్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ తాజాగా ట్విట్టర్ వేదికగా రివీల్ చేసింది.

‘రామ్ లల్లా దివ్యమైన అభరణాలు, వస్త్రాలతో ఈ రోజు కొలువు దీరాడు. ఈ దివ్య ఆభరణాలు ఆధ్యాత్మ రామాయణం, శ్రీమద్వాల్మీకి రామాయణం, శ్రీ రామచరితమానస్ మరియు ఆళవందర్ స్తోత్రాల పరిశోధన మరియు అధ్యయనం తర్వాత రూపొందించబడ్డాయి. ఈ పరిశోధన, యతీంద్ర మిశ్రా యొక్క కాన్సెప్ట్, డైరెక్షన్‌లో అయోధ్య బాల రాముడి ఆభరణాలను లక్నోలోని అంకుర్ ఆనంద్ సంస్థ హర్షహైమల్ శ్యామ్‌లాల్ జువెలర్స్ తయారు చేసింది. భగవంతుడు బనారసీ వస్త్రం మరియు ఎరుపు రంగు పాతుక, పసుపు ధోతిలో అలంకరించబడ్డాడు. ఈ బట్టలు స్వచ్ఛమైన బంగారు జరీ మరియు నక్షత్రాలతో తయారయ్యాయి. వీటిలో వైష్ణవ శుభ చిహ్నాలు - శంఖం, పద్మం, చక్రం మరియు నెమలి ఉన్నాయి. అయోధ్య ధామ్‌లో ఉంటూ ఢిల్లీ టెక్స్‌టైల్ డిజైనర్ మనీష్ త్రిపాఠి ఈ దుస్తులను తయారు చేశారు.’ అని తీర్థ క్షేత్ర తాజాగా ట్వీట్ చేసింది. 


Similar News