భక్తులకు గుడ్ న్యూస్.. మీ మొబైల్‌లో ఇది ఉచితంగా పొందండి
అయోధ్యలో బాలరాముడి విగ్రహం ప్రతిష్టించనున్న విషయం తెలిసిందే. దీంతో కోట్లాది మంది హిందువుల కల సాకారం అవుతోంది. శ్రీరాముడి విగ్రహ ప్రతిష్ట సందర్భంగా చాలా మంది భక్తులు రామచరితమానస్ చదువుతున్నారు.
దిశ, ఫీచర్స్ : అయోధ్యలో బాలరాముడి విగ్రహం ప్రతిష్టించనున్న విషయం తెలిసిందే. దీంతో కోట్లాది మంది హిందువుల కల సాకారం అవుతోంది. శ్రీరాముడి విగ్రహ ప్రతిష్ట సందర్భంగా చాలా మంది భక్తులు రామచరితమానస్ చదువుతున్నారు. వీటి కాపీల కోసం ఆన్‌లైన్‌లో వెతికి కొనుగోలు చేస్తున్నారు. దీంతో ప్రపంచంలోనే అతి పెద్ద పబ్లిషర్లలో ఒకటైన గీతా ప్రెస్ సంస్థ గొప్ప నిర్ణయం తీసుకుంది. రామభక్తులకు ఉచితంగానే రామచరితమానస్ చదువుకునే వీలు కల్పిస్తుంది.
ఆన్‌లైన్‌లో రామ్ చరిత్ మానస్ పుస్తకాన్ని 10 భాషల్లో ఉచితంగా చదువుకునే అవకాశం కల్పించింది.944 పేజీలు గల ఈ పుస్తకాన్ని భక్తులు ఉచితంగా ఆన్‌లైన్‌లో చదువుకోవచ్చు. దీని కోసం ముందుగా https://www.gitapress.org/ లోకి వెళ్లి మనకు ఏ భాష కావాలో ఆభాషను క్లిక్ చేయాలి.కొత్త విండో ఓపెన్ అయ్యి.. PDF ఫార్మాట్‌లో కనిపిస్తుంది. మొత్తం 944 పేజీలుంటాయి. ఒక్కో పేజీనీ విడివిడిగా చదివేందుకు వీలు ఉంది.