భార్యను విడిచిపెట్టిన మోదీ.. రాముడికి ఎలా పూజ చేస్తారు: బీజేపీ మాజీ ఎంపీ విమర్శలు
నరేంద్ర మోదీ ప్రాణ ప్రతిష్ఠ చేయడంపై ఆ పార్టీ సీనియర్ నేత సుబ్రమణియన్ స్వామి తీవ్ర విమర్శలు చేసారు.
దిశ, ఫీచర్స్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా బాల రాముడు ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం అయోధ్యలో ఘనంగా జరిగింది. కాకపొతే ఈ అద్భుత అవకాశం మోదీ మాత్రమే దక్కింది. అయితే, నరేంద్ర మోదీ ప్రాణ ప్రతిష్ఠ చేయడంపై ఆ పార్టీ సీనియర్ నేత సుబ్రమణియన్ స్వామి తీవ్ర విమర్శలు చేసారు.
పూజలో కూర్చోవడానికి ప్రధానికి ఏ అర్హత ఉంది.. కానీ పూజ చేయడానికి మోదీ ముందుకు వస్తున్నారని విమర్శించారు. అలాగే తన వ్యక్తిగత జీవితంలో రాముడిని ఆచరించిందే లేదు? ముఖ్యంగా తన భార్య విషయంలో కూడా ఏ రామ సిద్ధాంతాలను పాటించలేదు, గత పదేళ్లుగా మోదీ భారతదేశంలో రామరాజ్యం ప్రకారం పాలన చేయలేదని ఆరోపణలు చేసారు. అయితే మొదటి నుంచి బీజేపీ విధానాలపై, మోదీపై ఒక రేంజ్లో విమర్శలు చేస్తూనే ఉన్నారు సుబ్రమణియన్ స్వామి. ఇదే కాకుండా గత నెలలో కూడా అయోధ్య ప్రారంభోత్సవంలో ప్రధాని మోదీ పై తన అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు.
రాముడు, అతని భార్య కోసం ఒంటరి జీవితం గడిపాడని గుర్తు చేశారు. అయోధ్యలో రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ట పూజలో కూర్చోవడానికి రామ భక్తులు, మోదీని ఎలా అనుమతించారని ప్రశ్నించారు. భార్యను విడిచిపెట్టి చాలా ఫేమస్ అయిన మోదీ.. శ్రీ రాముడికి పూజలు ఎలా చేస్తారంటూ.. సుబ్రమణియన్ స్వామి మండిపడ్డారు. సొంత పార్టీ నేతలే మోదీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తుండటం ఆశ్చర్యానికి గురి చేస్తోంది.