ప్రపంచంలోనే మేటి చెఫ్.. అయోధ్యలో ప్రసాదం తయారు చేసేది ఆయనే..!

అయోధ్యలో రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం జనవరి 22 వ తేదీన అత్యంత వైభవంగా జరగనుంది.

Update: 2024-01-13 10:30 GMT

దిశ, ఫీచర్స్ : అయోధ్యలో రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం జనవరి 22 వ తేదీన అత్యంత వైభవంగా జరగనుంది. రాముడు జన్మించిన అయోధ్యలో రాముని ఆలయాన్ని చూడాలన్న ఎందరో భక్తుల కల నెరవేరనుంది. ప్రాణ ప్రతిష్ట సందర్భంగా శ్రీరామ మందిరంలో 7000 కిలోల హల్వాను ప్రసాదంగా తయారు చేస్తున్నారు. అయితే ఇంత పెద్ద ఎత్తున ప్రసాదం ఎవరు చేస్తున్నారు అన్న విషయం పై భక్తుల్లో ఉత్సాహం నెలకొంది. మరి ఆ అదృష్టవంతుడు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం..

మహారాష్ట్రలోని నాగ్‌పూర్ నివాసి విషు మనోహర్ అయోధ్యలోని శ్రీరామ మందిర ప్రారంభోత్సవం సందర్భంగా ప్రసాదం సిద్ధం చేస్తున్నారు. మనోహర్ విష్ణు ఇప్పటికే 12 ప్రపంచ రికార్డులను సాధించారు. కాగా అయోధ్య ట్రస్ట్ రాంలాలా శంకుస్థాపనకు ప్రసాదం సిద్ధం చేసే బాధ్యతను ఆయనకు అప్పగించారు.

ప్రసాదం తయారీకి 1400 కిలోల కడాయి

శ్రీరామ మందిరం ప్రారంభోత్సవం సందర్భంగా 7000 కిలోల హల్వాను ప్రసాదంగా తయారు చేస్తున్నారు. ఈ ప్రసాదాన్ని 1.5 లక్షల మంది రామభక్తులకు అందజేయనున్నారు. ఇంత పెద్ద మొత్తంలో హల్వా తయారు చేసే బాధ్యతను నాగ్‌పూర్‌కు చెందిన విష్ణు మనోహర్‌ తలకెత్తుకున్నారు. ఇంత పెద్ద మొత్తంలో హల్వా సిద్ధం చేయడానికి, నాగ్‌పూర్ నుండి కడాయిని కూడా తెప్పించారు. దాదాపు 1400 కిలోల బరువున్న ఈ కడాయిలో శ్రీరాముని ప్రసాదాన్ని తయారు చేయనున్నారు.

ప్రసాదానికి కావలసిన పదార్థాలు..

శ్రీరామ ప్రసాదం తయారీకి 900 కిలోల సెమోలినా, 1000 కిలోల చక్కెర, 2500 లీటర్ల పాలు, 300 కిలోల డ్రై ఫ్రూట్స్, 1000 కిలోల నెయ్యి, 2500 లీటర్ల నీటిని ఉపయోగిస్తున్నారు. రామ మందిరం ప్రారంభోత్సవం అనంతరం ఈ హల్వాను ప్రజలకు పంచనున్నారు.

12 ప్రపంచ రికార్డులు సాధించిన చెఫ్

ఇప్పటివరకు విష్ణు మనోహర్ 12 ప్రపంచ రికార్డులను సాధించారు. తాజాగా 285 నిమిషాల్లో అన్నం సహా 75 రకాల వంటకాలు తయారు చేసి ప్రపంచ రికార్డు సృష్టించాడు. విష్ణు మనోహర్ వివిధ రకాల వంటకాలు చేయడంలో నిపుణుడు.

Tags:    

Similar News