అయోధ్యకు వెళ్లాలనుకునేవారికి భారీ గుడ్ న్యూస్.. ఫ్రీ టికెట్స్!
ఉత్తరప్రదేశ్లో రామమందిర ప్రారంభానికి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ఎక్కడ చూసినా రామ మందిరం గురించే ముచ్చటిస్తున్నారు.
దిశ, ఫీచర్స్: ఉత్తరప్రదేశ్లో రామమందిర ప్రారంభానికి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ఎక్కడ చూసినా రామ మందిరం గురించే ముచ్చటిస్తున్నారు. ఈ ఆలయాన్ని భారీ మొత్తంలో ఖర్చు చేసి మరీ నిర్మించారు. అలాగే విగ్రహం ప్రతిష్టించే రోజు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పలు జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నారు. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం రామమందిరం విషయంలో ప్రత్యేక శ్రద్ధ పెడుతోంది. అయితే ఈ కార్యక్రమానికి వెళ్లేందుకు ఇప్పటికే చాలా మంది రైళ్లల్లో, విమానాల్లో, హోటళ్లలో బుకింగ్స్ కంప్లీట్ చేసుకున్నారు.
రామమందిర విగ్రహ ప్రతిష్టాపన చూడాలని ప్రజలు ఎన్నో ఆశలతో ఉన్నారు. కొందరికి అయోధ్యకు వెళ్లాలని ఉన్నా వెళ్లేందుకు వీలు లేకపోవడంతో నిరాశ చెందుతున్నారు. ఈ క్రమంలో paytm భారీ గుడ్ న్యూస్ ప్రకటించింది. బస్సు సేవలను స్టార్ట్ చేశారు. అయోధ్య వెళ్లాలనుకునేవారికి జనవరి 19 నుంచి 22 వరకు ఫ్రీ బస్ టికెట్స్ ఇస్తామని తెలిపారు. దీంతో ఈ విషయం తెలిసిన వారంతా బస్సు టికెట్స్ ఎలాగైనా పొందాలని ఆశపడుతున్నారు. అయితే ఈ అవకాశం టికెట్ బుక్ చేసుకున్న మొదటి వెయ్యి మందికి మాత్రమే వర్తిస్తుందని paytm తెలిపింది.