యువకుల అసాధారణ ఫీట్.. సాగర గర్భంలో సుందర రాముడు
అయోధ్యలో రామ్‌లల్లా విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని దేశ ప్రజలు వేయి కన్నులతో అనందోత్సాహాల నడుమ వీక్షించారు.
దిశ, వెబ్‌డెస్క్ : అయోధ్యలో రామ్‌లల్లా విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని దేశ ప్రజలు వేయి కన్నులతో అనందోత్సాహాల నడుమ వీక్షించారు. 500 ఏళ్ల నిరీక్షణ తరువాత బాల రాముడు ఆయన జన్మస్థానానికి చేరుకున్న నేపథ్యంలో దేశంలోని హిందువులంతా పండగ చేసుకుంటున్నారు. ప్రతి గ్రామం, పట్టణం అనే తేడా లేకుండా హిందూ ఆలయాల్లో ప్రత్యేక పూజలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో భక్తులంతా ఆలయాలకు వెళ్లి దేవతా మూర్తులను దర్శించుకుంటున్నారు.
ముఖ్యంగా యువత శ్రీరాముడి జెండాలు చెతబట్టి పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహిస్తున్నారు. మరికొన్ని ప్రాంతాల్లో రామ భక్తులు అన్నదాన కార్యక్రమాలను ఏర్పాటు చేసి నిరుపేదల ఆకలిని తీర్చుతున్నారు. ఈ క్రమంలోనే విశాఖలో కొందరు యువకులు అసాధారణ ఫీట్ చేశారు. నలుగురు ఆక్సిజన్ సిలిండర్లు ధరించి స్కూబా డైవ్ చేసి సాగర గర్భంలో వినూత్నంగా శ్రీరాముడి సుందర చిత్రాన్ని ఆవిష్కరించారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.