ఆ ఊరంతా రామమయం.. పుట్టే ప్రతీ బిడ్డకు రాముడి పేరే!
అంతా రామమయం, ఈ జగమంత రామమయం అనే పాట అందరికీ తెలిసిందే? ఈ పాట వినగానే అందరికీ శ్రీరామదాసు సినిమా పేరు గుర్తొస్తుంది. కానీ పశ్చిమ బెంగాల్‌లోని బంకుడా జిల్లాలో ఉన్న స్థానికులకు
దిశ, ఫీచర్స్ : అంతా రామమయం, ఈ జగమంత రామమయం అనే పాట అందరికీ తెలిసిందే? ఈ పాట వినగానే అందరికీ శ్రీరామదాసు సినిమా పేరు గుర్తొస్తుంది. కానీ పశ్చిమ బెంగాల్‌లోని బంకుడా జిల్లాలో ఉన్న స్థానికులకు సనాబంధ్ అనే గ్రామం గుర్తు వస్తుందంట. ఎందుకంటే అక్కడి ప్రజలు ఆ గ్రామాన్ని అంతా రామమయం అంటుంటారంట.
ఇక సనాబంధ్ గ్రామంలోని ఓ ప్రాతాన్ని రామపాద అని పిలుస్తారు. అక్కడి ప్రజల గిరిజన దేవుడు రాముడు, ఏళ్ల తరబడి వారు రామున్ని పూజిస్తున్నారు. ఎంతలా అంటే అక్కడ పుట్టిన ప్రతీ మగ బిడ్డకు రాముడి పేరే పెడుతారంట. ఇక్కడ శాలిగ్రామం రూపంలో శిలా రాముడు స్థానికులకు లభించడంతో, ఆ విగ్రహాన్ని ప్రతిష్టించి, 250 ఏళ్లుగా పూజిస్తున్నారు. అలా వీరి ఇంటి దైవం రాముడు అయిపోయాడు. అంతే కాకుండా 250 సంవత్సరాలుగా, ఆ గ్రామంలో పుట్టిన ప్రతీ మగబిడ్డకు రాముడి పేరే పెడుతున్నారు. అయితే ఆపేర్ల చివరన చిన్న చిన్న మార్పులు చేస్తారంట.