నెట్టింట ఆకర్షనీయంగా మారిన అయోధ్య ఫొటోలు.. బాలరాముడికి నైవేద్యంగా ఏం పెట్టారంటే?

హిందువులు ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించే రాముడి ఆలయం అయోధ్యలో నిర్మించిన విషయం తెలిసిందే.

Update: 2024-05-11 07:33 GMT
నెట్టింట ఆకర్షనీయంగా మారిన అయోధ్య ఫొటోలు.. బాలరాముడికి నైవేద్యంగా ఏం పెట్టారంటే?
  • whatsapp icon

దిశ, ఫీచర్స్: హిందువులు ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించే రాముడి ఆలయం అయోధ్యలో నిర్మించిన విషయం తెలిసిందే. జనవరి 22న బాల రాముని విగ్రహ ప్రతిష్టకు ఎంతో మంది ప్రముఖులు, భక్తులు వెళ్లి పూజలు చేశారు. ఇక అప్పటి నుంచి అయోధ్యలోని బాల రాముడు అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాడు. నిత్యం పలు ఫొటోలు వైరల్ కావడంతో జనాలు ఉప్పొంగి పోతున్నారు.

అయితే నిన్న అక్షయ తృతీయ కావడంతో బలరాముడికి నైవేద్యంగా సీజన్ ఫ్రూట్ మామిడి పండ్లను పెట్టారు. అలాగే డ్రాగన్, కివి, ద్రాక్ష, మామిడి పండ్ల జ్యూస్‌ బాటిళ్లను రామయ్య ముందు పెట్టారు. మామిడి తోరణాలతో పాటు పండ్లను సైతం వేలాడదీశారు. ప్రస్తుతం బాలరాముడికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఎంతమందిని ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతం బాల రాముడు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు.


Similar News