ఈ ఆలయంలోని హనుమాన్ దర్శనం చేసుకోకపోతే అయోధ్య యాత్ర అసంపూర్ణమట..

భారత దేశంలో ఎన్నో హనుమాన్ ఆలయాలు ఉన్నాయి. వీటిలో హనుమాన్‌గర్హి ఆలయం ఎంతో ప్రసిద్ది చెందింది.

Update: 2024-01-20 14:24 GMT

దిశ, ఫీచర్స్ : భారత దేశంలో ఎన్నో హనుమాన్ ఆలయాలు ఉన్నాయి. వీటిలో హనుమాన్‌గర్హి ఆలయం ఎంతో ప్రసిద్ది చెందింది. అయోధ్యలో ఉన్న ప్రధాన ఆలయాల్లో ఈ ఆలయాన్ని ఒకటిగా చెప్పుకోవచ్చు. అయోధ్యకు వచ్చిన శ్రీరామ భక్తులు ఈ ఆలయంలోని హనుమాన్ ని దర్శించకపోతే అయోధ్య యాత్ర అసంపూర్తి అవుతుందని అక్కడి పండితులు చెబుతున్నారు.

జనవరి 22న రామజన్మభూమిలో రామ్ లల్లా విగ్రహప్రతిష్ఠాపన కార్యక్రమం జరగనుంది. అయోధ్యలో శ్రీరామ ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ వైభవాన్ని చూసేందుకు ఇప్పటికే దేశ నలుమూలల నుంచి ఎంతో మంది భక్తులు అయోధ్యానగరానికి చేరుకుంటున్నారు. శ్రీరామ భక్తులు ఎన్నో ఏండ్ల కళ నెరవేరబోతుందని ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. విగ్రహప్రతిష్టాపన కార్యక్రమానికి వారం రోజుల నుంచే పలుకైకర్యాలు మొదలయ్యాయి.

ఈ అయోధ్యలో అతిపురాతన హనుమాన్‌గర్హి ఆలయం ఉంది. రామయ్య దర్శనానికి వచ్చిన భక్తులు ఈ ఆంజనేయ స్వామివారిని దర్శించకపోతే అయోధ్య ట్రిప్ అసంపూర్తి అవుతుందని చెబుతున్నారు. ఈ ఆలయానికి ఓ ప్రాముఖ్యత ఉంది. అయోధ్యలో ఉన్న ప్రధాన ఆలయాల్లో ఈ ఆలయం ఒకటి. శ్రీరాముడు రావణుడిని సంహరించిన అనంతరం అయోధ్యకు వచ్చిన తరువాత హనుమంతుడు బసచేయడానికి గర్హిలో కొంత స్థలాన్ని ఇచ్చాడని పురాణాలు చెబుతున్నాయి. ఇక్కడకు వచ్చిన భక్తులు తప్పనిసరిగా హనుమంతున్ని దర్శించుకోవాలని రామయ్య చెప్పాడని చెబుతారు. హనుమంతుడికి శ్రీ రామ చంద్రుడు ఇచ్చిన ఆ ప్రాంతాన్ని హనుమాన్‌గర్హిగా పిలుస్తారని చెబుతున్నారు. ఈ ఆలయంలో అంజనీ దేవి విగ్రహంతో పాటు బాలహనుమంతుడి రూపాన్ని చూడవచ్చు.

అన్ని దోషాలు తొలగించే హనుమాన్‌ దర్శనం

ఈ ఆలయాన్ని సందర్శిస్తే అన్ని కష్టాలు, దోషాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. ఎర్రటి పువ్వులను, ఎర్రటి వస్త్రాలను ఈ ఆలయంలోని హనుమంతుడికి సమర్పిస్తే జాతక దోషాలు పోతాయని చెబుతున్నారు.

Tags:    

Similar News