రామ మందిర భూమి పూజకు సన్నద్ధం
లక్నో: అయోధ్యలో రామ మందిర భూమి పూజకు సన్నాహాలు వేగంగా సాగుతున్నాయి. బుధవారం జరగనున్న ఈ పూజకు నగరం పసుపు రంగుతో ముస్తాబవుతోంది. యూపీలో వీకెండ్ లాక్‌డౌన్ కారణంగా సోమవారం ప్రారంభం కావలసిన పూజలు మంగళవారం నుంచి మొదలవుతున్నాయి. హనుమంతుడి పూజతో ఈ కార్యక్రమం మొదలుకానుంది. అన్ని స్థానిక మందిరాల్లో అఖండ రామాయణ పఠనం, ప్రతి ఇల్లు, గుడి, సరయూ నదీ తీరంలో మంగళవారం, బుధవారం రాత్రిళ్లలో దీపాలను వెలిగించాలని ప్రకటనలు జారీ అయ్యాయి. రామ మందిరం […]
లక్నో: అయోధ్యలో రామ మందిర భూమి పూజకు సన్నాహాలు వేగంగా సాగుతున్నాయి. బుధవారం జరగనున్న ఈ పూజకు నగరం పసుపు రంగుతో ముస్తాబవుతోంది. యూపీలో వీకెండ్ లాక్‌డౌన్ కారణంగా సోమవారం ప్రారంభం కావలసిన పూజలు మంగళవారం నుంచి మొదలవుతున్నాయి. హనుమంతుడి పూజతో ఈ కార్యక్రమం మొదలుకానుంది. అన్ని స్థానిక మందిరాల్లో అఖండ రామాయణ పఠనం, ప్రతి ఇల్లు, గుడి, సరయూ నదీ తీరంలో మంగళవారం, బుధవారం రాత్రిళ్లలో దీపాలను వెలిగించాలని ప్రకటనలు జారీ అయ్యాయి.
రామ మందిరం భూమి పూజ కార్యక్రమంలో కొవిడ్ నిబంధనలన్నీ పాటించబోతున్నట్టు ట్రస్టు వర్గాలు తెలిపాయి. దీనికోసం ఆహ్వానితుల సంఖ్యను 260 మంది నుంచి 175 తగ్గించనట్టు వెల్లడించాయి. ఇందులో 133 మంది సన్యాసులు, బీజేపీ, ఆర్‌ఎస్ఎస్, వీహెచ్‌పీ సహా పలువురున్నారు. మెయిన్ స్టేజ్‌పై ప్రధాని మోడీ, యూపీ గవర్నర్ ఆనందీబెన్ పటేల్, సీఎం యోగి ఆదిత్యానాథ్, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్, ట్రస్టు అధ్యక్షుడు మహంత్ నృత్య గోపాల్ దాస్‌లు ఆసీనులుకానున్నట్టు సమాచారం. 22.60 కిలోల వెండి ఇటుకతో ప్రధాని మోడీ శంకుస్థాపన చేయనున్నట్టు తెలుస్తున్నది.