మూడు వారాలు చాలా కష్టంగా ఉంది: అక్షర్

దిశ, స్పోర్ట్స్: టీమ్ ఇండియా ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ ఐపీఎల్ 2021క సీజన్ బయోబబుల్‌లోకి ప్రవేశించిన తర్వాత కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. ఢిల్లీకి ప్రాతినిథ్యం వహిస్తున్న అక్షర్ పటేల్ మార్చి 28న ఢిల్లీ క్యాపిటల్స్ ఉంటున్న హోటల్‌కు చేరుకున్నాడు. బయోబబుల్‌లోకి వెళ్లే ముందు టెస్ట్ చేయగా నెగెటివ్ రిపోర్టు వచ్చింది. ఏప్రిల్ 3న తిరిగి టెస్టు చేయగా కరోనా పాజిటివ్ తేలడంతో ఐసోలేషన్‌లోకి వెళ్లాడు. మూడు వారాల పాటు అక్కడే చికిత్స తీసుకున్న అక్షర్‌కు […]

Update: 2021-04-23 08:48 GMT

దిశ, స్పోర్ట్స్: టీమ్ ఇండియా ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ ఐపీఎల్ 2021క సీజన్ బయోబబుల్‌లోకి ప్రవేశించిన తర్వాత కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. ఢిల్లీకి ప్రాతినిథ్యం వహిస్తున్న అక్షర్ పటేల్ మార్చి 28న ఢిల్లీ క్యాపిటల్స్ ఉంటున్న హోటల్‌కు చేరుకున్నాడు. బయోబబుల్‌లోకి వెళ్లే ముందు టెస్ట్ చేయగా నెగెటివ్ రిపోర్టు వచ్చింది. ఏప్రిల్ 3న తిరిగి టెస్టు చేయగా కరోనా పాజిటివ్ తేలడంతో ఐసోలేషన్‌లోకి వెళ్లాడు. మూడు వారాల పాటు అక్కడే చికిత్స తీసుకున్న అక్షర్‌కు తాజాగా జరిపిన పరీక్షలో నెగెటివ్‌గా తేలాడు. రెండో పరీక్ష కూడా నెగెటివ్ రావడంతో శుక్రవారం అతను జట్టుతో చేరినట్లు యాజమాన్యం ప్రకటించింది.

‘తిరిగి జట్టుతో చేరడం చాలా ఆనందంగా ఉంది. మనుషులందరినీ చూడగానే నాకు సంతోషం వేసింది. మూడు వారాలు అందరికీ దూరంగా ఉండటం చాలా కష్టంగా ఉన్నది’ అని అక్షర్ అన్నాడు. అతనికి ముందు కరోనా బారిన పడిన దేవ్‌దత్ పడిక్కల్ తిరిగి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుతో చేరి సెంచరీ బాదిన విషయం తెలిసిందే.

Tags:    

Similar News