ఫిర్యాదుదారులతో మర్యాదగా వ్యవహరించాలి: నిర్మల్ ఎస్పీ
పోలీసులు సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంచుకోవాలని ఎస్పీ శశిధర్‌రాజు సూచించారు. గురువారం నిర్మల్ జిల్లాలోని ఆయా పోలీసు ఠాణాల రైటర్లకు ఒక్కరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో ఎస్పీ శశిధర్ మాట్లాడుతూ ఫిర్యాదుదారులు పోలీస్ స్టేషన్‌కు వచ్చినప్పుడు వారితో మర్యాదగా ప్రవర్తించాలన్నారు. తొలుత వారు చెప్పేది వినాలి, ఆ తర్వాత సమస్య తీవ్రతను బట్టి ఎస్‌హెచ్‌వోతో మాట్లాడి పరిష్కరించాలని సూచించారు. ఇలా చేస్తే ఫిర్యాదుదారుల్లో సంతృప్తి పెరుగుతుందని, ఆయా ఠాణాలకు మంచి […]
పోలీసులు సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంచుకోవాలని ఎస్పీ శశిధర్‌రాజు సూచించారు. గురువారం నిర్మల్ జిల్లాలోని ఆయా పోలీసు ఠాణాల రైటర్లకు ఒక్కరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో ఎస్పీ శశిధర్ మాట్లాడుతూ ఫిర్యాదుదారులు పోలీస్ స్టేషన్‌కు వచ్చినప్పుడు వారితో మర్యాదగా ప్రవర్తించాలన్నారు. తొలుత వారు చెప్పేది వినాలి, ఆ తర్వాత సమస్య తీవ్రతను బట్టి ఎస్‌హెచ్‌వోతో మాట్లాడి పరిష్కరించాలని సూచించారు. ఇలా చేస్తే ఫిర్యాదుదారుల్లో సంతృప్తి పెరుగుతుందని, ఆయా ఠాణాలకు మంచి పేరు వస్తుందని చెప్పారు. ఫిర్యాదుదారుల పట్ల ఉదాసీనంగా వ్యవహరిస్తే తగిన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఐటీ టీమ్ ఇన్‌ఛార్జి యస్ కే మురాద్ అలీ, అదనపు ఎస్పీ శ్రీనివాస్‌రావు, జీవన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.