154 పరుగులు చేసిన రాజస్తాన్

దిశ, వెబ్‌డెస్క్: టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన రాజస్తాన్ రాయల్స్ తడబడింది. ఓపెనర్లు చేతులెత్తయడంతో 154 పరుగులకే సరిపెట్టుకుంది. కెప్టెన్ స్మిత్(5) 27 పరుగుల వద్దనే పెవిలియన్ చేరడంతో.. అతడి వెనకాలే జోస్ బట్లర్(22) 31 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. కీలక ఓపెనర్లను కోల్పోయిన రాయల్స్‌ జట్టుకు అంతలోనే మరో ఎదురు దెబ్బ తగిలింది. హార్డ్ హిట్టర్ సంజూ శాంసన్ 4 పరుగులు మాత్రమే చేసి కూడా 31 స్కోర్ బోర్డు వద్ద పెవిలియన్ బాట […]

Update: 2020-10-03 06:47 GMT

దిశ, వెబ్‌డెస్క్: టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన రాజస్తాన్ రాయల్స్ తడబడింది. ఓపెనర్లు చేతులెత్తయడంతో 154 పరుగులకే సరిపెట్టుకుంది. కెప్టెన్ స్మిత్(5) 27 పరుగుల వద్దనే పెవిలియన్ చేరడంతో.. అతడి వెనకాలే జోస్ బట్లర్(22) 31 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. కీలక ఓపెనర్లను కోల్పోయిన రాయల్స్‌ జట్టుకు అంతలోనే మరో ఎదురు దెబ్బ తగిలింది. హార్డ్ హిట్టర్ సంజూ శాంసన్ 4 పరుగులు మాత్రమే చేసి కూడా 31 స్కోర్ బోర్డు వద్ద పెవిలియన్ బాట పట్టాడు.

ఇక మిడిలార్డర్‌లో వచ్చిన రాబిన్ ఉతప్ప(17) ఎక్కువ సేపు క్రీజులో నిలవలేదు. దీంతో 70 పరుగుల వద్దనే రాజస్తాన్ నాలుగు వికెట్లు కోల్పోయింది. రియాన్ పరాగ్ కూడా కేవలం 16 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. ఇటువంటి సమయంలో మహిపాల్ లోమ్రర్ మంచి ఇన్నింగ్స్ ఆడాడు. 47 పరుగులు చేసి స్కోరు బోర్డును ముందుకు తీసుకెళ్లాడు. కానీ, 114 పరుగుల వద్దనే చాహల్ వేసిన బంతిని షాట్ ఆడబోయి దేవదత్‌ పడిక్కల్‌కు క్యాచ్ ఇచ్చాడు. దీంతో 6 వికెట్లు కోల్పోయిన రాజస్తాన్‌కు రాహుల్ తివాతియా, జోఫ్రా ఆర్చర్ తమ వంతు కృషి చేసి నాటౌట్‌గా నిలిచారు. దీంతో నిర్దిష్ఠ 20 ఓవర్లలో రాజస్తాన్ రాయల్స్ 6 వికెట్ల నష్టానికి 154 పరుగుల మాత్రమే చేయగలిగింది.

Tags:    

Similar News