లోకేశ్‌కు అవంతి సవాల్

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఉత్తరాంధ్ర రెండు జిల్లాల పర్యటన అర్ధాంతరంగా నిలిచిపోయిన నేపథ్యంలో టీడీపీ, వైఎస్సార్సీపీ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. రెండు పార్టీలకు చెందిన నేతలు ప్రెస్ మీట్లు పెట్టి విమర్శలు కురిపించుకుంటున్నారు. సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉండే నేతలు ట్వీట్లలో విమర్శలు, ఎత్తిపొడుపులతో విమర్శలు చేస్తున్నారు. ఈ నేపధ్యంలో మంత్రి అవంతి శ్రీనివాస్ టీడీపీ జాతీయాధ్యక్షుడు నారా లోకేశ్‌కు సవాల్ విసిరారు. ఇంటికి వెళ్లి తంతామని నారాలోకేశ్ అంటున్నాడని, ఎవరి ఇంటికి వెళ్లి తంతాడో […]

Update: 2020-02-28 04:48 GMT

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఉత్తరాంధ్ర రెండు జిల్లాల పర్యటన అర్ధాంతరంగా నిలిచిపోయిన నేపథ్యంలో టీడీపీ, వైఎస్సార్సీపీ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. రెండు పార్టీలకు చెందిన నేతలు ప్రెస్ మీట్లు పెట్టి విమర్శలు కురిపించుకుంటున్నారు. సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉండే నేతలు ట్వీట్లలో విమర్శలు, ఎత్తిపొడుపులతో విమర్శలు చేస్తున్నారు. ఈ నేపధ్యంలో మంత్రి అవంతి శ్రీనివాస్ టీడీపీ జాతీయాధ్యక్షుడు నారా లోకేశ్‌కు సవాల్ విసిరారు. ఇంటికి వెళ్లి తంతామని నారాలోకేశ్ అంటున్నాడని, ఎవరి ఇంటికి వెళ్లి తంతాడో లోకేశ్‌ను రమ్మనండి అంటూ సవాల్ విసిరారు. ప్రజలు వారి అసహనాన్ని, అసంతృప్తిని వివిధ రకాలుగా వ్యక్తం చేస్తుంటారని, అలాంటప్పుడు సంయమనంతో వ్యవహరించాలని ఆయన హితవు పలికారు. లోకేశ్ మాట్లాడుతున్న తీరు ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టుతున్నట్టు ఉందని అవంతి విమర్శించారు.

Tags:    

Similar News