ఆ ముగ్గురిపై అవంతి శ్రీనివాస్ ఆగ్రహం
దిశ, వెబ్‌డెస్క్: ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్ చంద్రబాబు, రఘురామకృష్ణం రాజు, పవన్ కళ్యాణ్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… విశాఖలో ఏదో జరిగిపోతోందని చంద్రబాబు మాట్లాడుతున్నారని.. ప్రభుత్వం గెస్ట్ హౌస్ కడుతుంటే తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. జీవో ఇచ్చిన ప్రకారమే రాష్ట్రంలో నాలుగు చోట్ల గెస్ట్ హౌస్‌లు కడుతున్నామని అవంతి శ్రీనివాస్ వివరణ ఇచ్చారు. చంద్రబాబు స్క్రిప్ట్‌ను రఘురామకృష్ణం రాజు చదువుతున్నారని ఆరోపించారు. ఉత్తరాంధ్ర కోసం మాట్లాడే హక్కు […]
దిశ, వెబ్‌డెస్క్: ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్ చంద్రబాబు, రఘురామకృష్ణం రాజు, పవన్ కళ్యాణ్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… విశాఖలో ఏదో జరిగిపోతోందని చంద్రబాబు మాట్లాడుతున్నారని.. ప్రభుత్వం గెస్ట్ హౌస్ కడుతుంటే తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
జీవో ఇచ్చిన ప్రకారమే రాష్ట్రంలో నాలుగు చోట్ల గెస్ట్ హౌస్‌లు కడుతున్నామని అవంతి శ్రీనివాస్ వివరణ ఇచ్చారు. చంద్రబాబు స్క్రిప్ట్‌ను రఘురామకృష్ణం రాజు చదువుతున్నారని ఆరోపించారు. ఉత్తరాంధ్ర కోసం మాట్లాడే హక్కు రఘురామకృష్ణం రాజుకు లేదని దుయ్యబట్టారు. పవన్ ఏం మాట్లాడుతున్నారో ఆయనకే తెలియదని అవంతి ఎద్దేవా చేశారు. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌కు వ్యతిరేకంగా పవన్ మాట్లాడటం సరికాదని అవంతి శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు.