మార్కెట్ లోకి కొత్త Yamaha R15 M.. ధర ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..

యమహా మోటార్ ఇండియా Yamaha R15 Mని మార్కెట్లోకి అందుబాటులోకి తీసుకువచ్చింది.

Update: 2024-09-13 14:44 GMT

దిశ, వెబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డెస్క్ : యమహా మోటార్ ఇండియా Yamaha R15 Mని మార్కెట్లోకి అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ బైక్ కార్బన్ ఫైబర్ ప్యాటర్న్ గ్రాఫిక్‌లను కలిగి ఉంది. దీని ధర రూ. 2.08 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఆసక్తిగల కస్టమర్లు భారతదేశం అంతటా యమహా బ్లూ స్క్వేర్ షోరూమ్‌లలో కొత్త మోడల్‌ను కొనుగోలు చేయవచ్చు. కంపెనీ మెటాలిక్ గ్రేలో అప్‌గ్రేడ్ చేసిన R15Mని కూడా విడుదల చేసింది. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ. 1.98 లక్షలు.

కొత్త డిజైన్, టెక్నాలజీ..

యమహా కొత్త కార్బన్ ఫైబర్ డిజైన్ R1M కార్బన్ బాడీ వర్క్, అధునాతన వాటర్-డిపింగ్ టెక్నాలజీని కలిగి ఉంది. అలాగే ఈ బైక్ లో ఫ్రంట్ కౌల్, సైడ్ ఫెయిరింగ్‌లు, వెనుక వైపు ప్యానెల్‌ల పై చూడవచ్చు. అలాగు R15M బైక్ ఆల్-బ్లాక్ ఫెండర్, కొత్త డీకాల్స్, బ్లూ వీల్స్‌ను కలిగి ఉంటుంది.

బైక్ టర్న్-బై-టర్న్ నావిగేషన్, మ్యూజిక్ కంట్రోల్‌తో సహా మంచి ఫీచర్లను అందిస్తుంది. యమహా Y-కనెక్ట్ యాప్ ద్వారా యాక్సెస్ చేయవచ్చు. బైక్‌తో సింక్ చేయడానికి రైడర్‌లు తమ స్మార్ట్‌ఫోన్‌లలో యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. అప్‌గ్రేడ్ చేసిన స్విచ్ గేర్, కొత్త LED లైసెన్స్ ప్లేట్ లైట్, పూర్తిగా డిజిటల్ TFT స్క్రీన్‌లు, బ్లూటూత్ కనెక్టివిటీ, ట్రాక్షన్ కంట్రోల్, క్విక్ షిఫ్టర్ వంటి మంచి ఫీచర్స్ ఉన్నాయి.

ఇంజన్, పనితీరు..

R15M 155cc లిక్విడ్ - కూల్డ్, సింగిల్ - సిలిండర్ పెట్రోల్ ఇంజన్‌తో బైక్ కొనసాగుతుంది. 10,000 rpm వద్ద 18bhp పవర్, 7,500 rpm వద్ద 14.2Nm టార్క్‌ను అందిస్తుంది. ఇంజన్ ఆరు -స్పీడ్ గేర్‌బాక్స్‌తో పెయిర్ చేశారు.


Similar News