అమ్మకాల్లో ‘కియా’కు సాటి లేరు

దిశ, వెబ్‌డెస్క్: దక్షిణ కొరియా ఆటో మొబైల్‌ దిగ్గజం కియా.. భారత్‌లో ఆలస్యంగా ప్లాంట్ ఏర్పాటు చేసుకున్నా.. సేల్స్‌లో మాత్రం అగ్ర స్థానంలో దూసుకెళ్తోంది. భారత్‌లో పాతుకుపోయిన ఎన్నో సంస్థలను అధిగమిస్తూ భారీ అమ్మకాలను నమోదు చేస్తోంది. కేవలం 11 నెలల కాలంలో ఏ ఆటో మోబైల్‌ సంస్థ చేయని స్థాయిలో లక్షకు పైగా వాహనాల విక్రయాలు జరిపింది. దీంతో అతి తక్కువ సమయంలోనే ఎక్కువ కార్లు విక్రయించిన ఏకైక ఆటోమొబైల్‌ సంస్థగా కియా మోటర్స్ రికార్డు […]

Update: 2020-07-31 09:45 GMT

దిశ, వెబ్‌డెస్క్: దక్షిణ కొరియా ఆటో మొబైల్‌ దిగ్గజం కియా.. భారత్‌లో ఆలస్యంగా ప్లాంట్ ఏర్పాటు చేసుకున్నా.. సేల్స్‌లో మాత్రం అగ్ర స్థానంలో దూసుకెళ్తోంది. భారత్‌లో పాతుకుపోయిన ఎన్నో సంస్థలను అధిగమిస్తూ భారీ అమ్మకాలను నమోదు చేస్తోంది. కేవలం 11 నెలల కాలంలో ఏ ఆటో మోబైల్‌ సంస్థ చేయని స్థాయిలో లక్షకు పైగా వాహనాల విక్రయాలు జరిపింది.

దీంతో అతి తక్కువ సమయంలోనే ఎక్కువ కార్లు విక్రయించిన ఏకైక ఆటోమొబైల్‌ సంస్థగా కియా మోటర్స్ రికార్డు సృష్టించింది. ఇందులో రెండే రెండు మోడళ్లు మార్కెట్‌లో కియా ముద్రను వేశాయి. కాగా, 2019లో కియా మోటర్స్ నుంచి భారత్‌లో సెల్టోస్‌ను ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత వచ్చిన కార్నివాల్ కూడా భారత మార్కెట్లో మెరుగైన ఫలితాలనిచ్చాయి. కియా ఇప్పటివరకు 97,745 సెల్టోస్ కార్లు, 3,164 కార్నివాల్ వాహనాలు అమ్ముడుపోయినట్లు కియా ఎండీ, సీఈవో కూక్ హ్యూన్ సిమ్ స్పష్టం చేశారు.

Tags:    

Similar News