స్కూల్‌కు వెళ్లాల్సిన ఆటో పొలాల్లోకి.. విద్యార్థినిపై డ్రైవర్..

దిశ, వెబ్ డెస్క్: దేశంలో అమ్మాయిలకు రక్షణ లేకుండా పోతుంది. సొంతవారిని సైతం నమ్మలేని పరిస్థితి దాపురించింది. కామంతో కళ్లు మూసుకుపోయిన మృగాళ్లు, గోతికాడ నక్కలా కాపుకాచి అమ్మాయిలపై విరుచుకుపడుతున్నారు. తాజాగా ఒక విద్యార్థినిపై ఆటో డ్రైవర్ అఘాయిత్యానికి పాల్పడిన ఘటన పీలేరు లో వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం… యర్రగుంటపల్లె పంచాయతీ ఎస్టీ కాలనీకి చెందిన విద్యార్థిని పీలేరు మండలంలోని ఒక పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. రోజు ఆటో లో వెళ్లి […]

Update: 2021-04-22 00:28 GMT

దిశ, వెబ్ డెస్క్: దేశంలో అమ్మాయిలకు రక్షణ లేకుండా పోతుంది. సొంతవారిని సైతం నమ్మలేని పరిస్థితి దాపురించింది. కామంతో కళ్లు మూసుకుపోయిన మృగాళ్లు, గోతికాడ నక్కలా కాపుకాచి అమ్మాయిలపై విరుచుకుపడుతున్నారు. తాజాగా ఒక విద్యార్థినిపై ఆటో డ్రైవర్ అఘాయిత్యానికి పాల్పడిన ఘటన పీలేరు లో వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం… యర్రగుంటపల్లె పంచాయతీ ఎస్టీ కాలనీకి చెందిన విద్యార్థిని పీలేరు మండలంలోని ఒక పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. రోజు ఆటో లో వెళ్లి వస్తుండేది. ఎప్పటిలానే బుధవారం కూడా ఆటోలో స్కూల్ కి వెళ్ళడానికి ఆటో ఎక్కింది. అయితే మిగతా విద్యార్థులందరికీ సెలవు కావడంతో విద్యార్థిని ఒక్కతే ఆటో లో బయల్దేరింది.

ఇదే అదునుగా భావించిన ఆటో డ్రైవర్ నరేష్ ఆమెను స్కూల్ కి కాకుండా మార్గమధ్యంలోని పొలాలవైపు ఆటోని మళ్ళించాడు. అక్కడ విద్యార్థినిపై అత్యాచారం చేయడానికి ప్రయత్నించాడు. విద్యార్థిని గట్టిగా కేకలు వేయడంతో ఆమెను స్కూల్ దగ్గర దింపి పరారయ్యాడు. విద్యార్థిని సాయంత్రం ఇంటికి వచ్చి, జరిగిందంతా తల్లిదండ్రులకు వివరించింది. దీంతో విద్యార్థిని తల్లిదండ్రులు ఆటో డ్రైవర్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆటో డ్రైవర్ ని అరెస్ట్ చేశారు.

Tags:    

Similar News