గచ్చిబౌలిలో భారీగా పోలీసుల మోహరింపు.. ఏమైందంటే?
దిశ, శేరిలింగంపల్లి: రోడ్డు వెడల్పు కోసమంటూ గచ్చిబౌలి డివిజన్ గోపన్ పల్లిలో భారీ ఎత్తున ఇళ్లను రెవెన్యూ అధికారులు కూలుస్తున్నారు. గోపన్ పల్లి చౌరస్తా నుంచి తిమ్మాపూర్ వరకు రోడ్డుకు ఇరువైపులా ఉన్న 42 ఇళ్లను ఈ ఉదయం 7 గంటల నుంచి భారీ పోలీస్ బందోబస్తు మధ్య కూల్చివేతలు చేపట్టారు. దీంతో స్థానికులు కూల్చివేతలను అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికీ రెవెన్యూ అధికారులు ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. ఇప్పటికే పలుమార్లు నోటీసులు జారీ చేశామని, స్థలాలు కోల్పోతున్నవారికి […]
దిశ, శేరిలింగంపల్లి: రోడ్డు వెడల్పు కోసమంటూ గచ్చిబౌలి డివిజన్ గోపన్ పల్లిలో భారీ ఎత్తున ఇళ్లను రెవెన్యూ అధికారులు కూలుస్తున్నారు. గోపన్ పల్లి చౌరస్తా నుంచి తిమ్మాపూర్ వరకు రోడ్డుకు ఇరువైపులా ఉన్న 42 ఇళ్లను ఈ ఉదయం 7 గంటల నుంచి భారీ పోలీస్ బందోబస్తు మధ్య కూల్చివేతలు చేపట్టారు. దీంతో స్థానికులు కూల్చివేతలను అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికీ రెవెన్యూ అధికారులు ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. ఇప్పటికే పలుమార్లు నోటీసులు జారీ చేశామని, స్థలాలు కోల్పోతున్నవారికి పరిహారం కూడా అందించామని, అయినా ఇళ్లను ఖాళీ చేయడం లేదని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో నిర్మాణాలను కూలుస్తున్నామని తెలిపారు.
భారీగా పోలీసుల మోహరింపు
ఇళ్ల కూల్చివేత్తలను స్థానికులు అడ్డుకోవడంతో గచ్చిబౌలి, మియాపూర్, మాదాపూర్ పోలీస్ స్టేషన్లకు సంబంధించిన పోలీసు సిబ్బంది, ప్రత్యేక బలగాలను మోహరించారు అధికారులు.