ఆరోన్ ఫించ్ అరుదైన రికార్డు

దిశ, వెబ్‌డెస్క్: భారత జట్టుతో సిడ్నీ వేదికగా జరుగుతున్న వన్డే మ్యాచ్‌లో ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు కెప్టెన్ ఆరోన్ ఫించ్ అరుదైన ఘనత సాధించాడు. వన్డే ఫార్మాట్‌లో అత్యంత వేగంగా ఐదువేల పరుగులు చేసిన ఆస్ట్రేలియన్ క్రికెటర్‌గా ఫించ్ రికార్డు సృష్టించాడు. దీంతో మాజీ ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్ డీన్ జోన్స్‌ను దాటాడు. అయితే అత్యంత వేగంగా చేసిన వారిలో మొదట స్థానంలో డేవిడ్ వార్నర్ ఉండగా, రెండోస్థానంలో ఆరోన్ ఫించ్ ఉన్నాడు. కాగా వార్నర్ 115 ఇన్నింగ్స్‌లో […]

Update: 2020-11-27 04:31 GMT

దిశ, వెబ్‌డెస్క్: భారత జట్టుతో సిడ్నీ వేదికగా జరుగుతున్న వన్డే మ్యాచ్‌లో ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు కెప్టెన్ ఆరోన్ ఫించ్ అరుదైన ఘనత సాధించాడు. వన్డే ఫార్మాట్‌లో అత్యంత వేగంగా ఐదువేల పరుగులు చేసిన ఆస్ట్రేలియన్ క్రికెటర్‌గా ఫించ్ రికార్డు సృష్టించాడు. దీంతో మాజీ ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్ డీన్ జోన్స్‌ను దాటాడు. అయితే అత్యంత వేగంగా చేసిన వారిలో మొదట స్థానంలో డేవిడ్ వార్నర్ ఉండగా, రెండోస్థానంలో ఆరోన్ ఫించ్ ఉన్నాడు. కాగా వార్నర్ 115 ఇన్నింగ్స్‌లో ఈ ఫీట్ సాధించగా, ఫించ్ 126 ఇన్నింగ్‌లో చేశాడు. డీన్ జోన్స్ 128 ఇన్నింగ్స్‌లో ఈ ఘనత సాధించారు.

Tags:    

Similar News